కైకొననంటా నన్నుఁ గడు దూరేవు
(॥పల్లవి॥)
కైకొననంటా నన్నుఁ గడు దూరేవు
నీకు లేని బత్తి నేఁడు నేఁ దెచ్చేనా
(॥కైకొ॥)
వాడిక మాయింటికే వచ్చితేనే కందుఁగాక
వేడుకాఁడవు నిన్ను వెదకేదెట్టు
ఆడుకోలుమాటాలు నీ వాడితే నాడుదుఁగాక
పాడితోదొరవు నిన్ను బలిమిసేసేనా
(॥కైకొ॥)
చేయివట్టి పెనఁగితే చెప్పినట్టు సేతుఁగాక
చాయకాఁడవు నీతోను సొరెఁ బోరేనా
కాయము నీవంటితేను కాఁగిలించుకొందుఁగాక
వేయిపనులవాఁడవు వేసరించేనా
(॥కైకొ॥)
గక్కున నవ్వితే నీతోఁ గమ్మటి నవ్వుదుఁ గాక
యెక్కడో పరాకుల నిన్నెత్తువెట్టేనా
యిక్కుమాతో శ్రీవేంకటేశ నన్నుఁ గూడితివి
మిక్కిలి మేలువాఁడవు మెచ్చకుండేనా
(||pallavi||)
kaigŏnanaṁṭā nannum̐ gaḍu dūrevu
nīgu leni batti nem̐ḍu nem̐ dĕchchenā
(||kaigŏ||)
vāḍiga māyiṁṭige vachchidene kaṁdum̐gāga
veḍugām̐ḍavu ninnu vĕdagedĕṭṭu
āḍugolumāḍālu nī vāḍide nāḍudum̐gāga
pāḍidodŏravu ninnu balimisesenā
(||kaigŏ||)
seyivaṭṭi pĕnam̐gide sĕppinaṭṭu sedum̐gāga
sāyagām̐ḍavu nīdonu sŏrĕm̐ borenā
kāyamu nīvaṁṭidenu kām̐giliṁchugŏṁdum̐gāga
veyibanulavām̐ḍavu vesariṁchenā
(||kaigŏ||)
gakkuna navvide nīdom̐ gammaḍi navvudum̐ gāga
yĕkkaḍo parāgula ninnĕttuvĕṭṭenā
yikkumādo śhrīveṁkaḍeśha nannum̐ gūḍidivi
mikkili meluvām̐ḍavu mĕchchaguṁḍenā