కైకొనఁగవచ్చుఁ గాని కడమవెట్టఁగ రాదు
(॥పల్లవి॥)
కైకొనఁగవచ్చుఁ గాని కడమవెట్టఁగ రాదు
దీకొని యిన్నియుఁ దానే తెలుసుకొమ్మనవే
(॥॥)
పొందుసేయఁగవచ్చుఁగాని పురివిచ్చి పాయరాదు
అందునుండే యెడమాట లాడుటేచాలు
అంది నవ్వవచ్చుఁ గాని ఆఁపరాదు తమకము
చందమామగుటుకలే చాలుఁజాలుననవే
(॥॥)
కన్నులఁజూడఁగవచ్చు కాఁకలఁ బొరలరాదు
విన్నవినుకులలోనివేడుకే చాలు
మన్ననఁ బొందఁగవచ్చు మరితీలుపడరాదు
సన్నలచాయలనుంటే జాణతనమనవే
(॥॥)
చిత్త మియ్యఁగవచ్చుఁగాని సిగ్గునఁబడఁగరాదు
పొత్తులవలపు తోడిభోగమే చాలు
యిత్తల శ్రీ వేంకటేశుఁడింతలోనె నన్నుఁ గూడె
కొత్తలాయ నిన్నియును గుఱుతాయననవే
(||pallavi||)
kaigŏnam̐gavachchum̐ gāni kaḍamavĕṭṭam̐ga rādu
dīgŏni yinniyum̐ dāne tĕlusugŏmmanave
(||||)
pŏṁduseyam̐gavachchum̐gāni purivichchi pāyarādu
aṁdunuṁḍe yĕḍamāḍa lāḍuḍesālu
aṁdi navvavachchum̐ gāni ām̐parādu tamagamu
saṁdamāmaguḍugale sālum̐jālunanave
(||||)
kannulam̐jūḍam̐gavachchu kām̐kalam̐ bŏralarādu
vinnavinugulaloniveḍuge sālu
mannanam̐ bŏṁdam̐gavachchu maridīlubaḍarādu
sannalasāyalanuṁṭe jāṇadanamanave
(||||)
sitta miyyam̐gavachchum̐gāni siggunam̐baḍam̐garādu
pŏttulavalabu toḍibhogame sālu
yittala śhrī veṁkaḍeśhum̐ḍiṁtalonĕ nannum̐ gūḍĕ
kŏttalāya ninniyunu guṟudāyananave