Kaigomte kaaga kamalanaabhuni yaajnyaa

కైకొంటే కాక కమలనాభుని యాజ్ఞ
Language

(॥పల్లవి॥)
కైకొంటే కాక కమలనాభుని యాజ్ఞ
పైకొని ఇన్నిటాను బాసి వుండనేది

(॥కైకొంటే॥)
హరినిర్మితములే అఖిలప్రపంచము
తొరలి యేమిటి నిందు దూషించేది
ధరణిధరునికి దాసులే జీవులెల్లా
గరిమ నెవ్వరి నిందుఁ గాదనేది

(॥కైకొంటే॥)
వాసుదేవు కల్పితమే వరసంసార బంధము
దోసమంటా యెందెందు దొలఁగేది
శ్రీసతీశు రచనలే చేకొన్న రుచులెల్ల
యీసుతోడ నిందువిూఁద నెట్టురోసేది

(॥కైకొంటే॥)
గోవిందుమాయలే కూడినట్టి పనులెల్ల
వేవేలై యిందునెట్టు వేసరేది
శ్రీవేంకటేశుఁడే చిత్తములో ధ్యానమెల్లా
పావనమైతిమి యిఁక బరచింత యేది

(||pallavi||)
kaigŏṁṭe kāga kamalanābhuni yājña
paigŏni inniḍānu bāsi vuṁḍanedi

(||kaigŏṁṭe||)
harinirmidamule akhilaprabaṁchamu
tŏrali yemiḍi niṁdu dūṣhiṁchedi
dharaṇidharunigi dāsule jīvulĕllā
garima nĕvvari niṁdum̐ gādanedi

(||kaigŏṁṭe||)
vāsudevu kalbidame varasaṁsāra baṁdhamu
dosamaṁṭā yĕṁdĕṁdu dŏlam̐gedi
śhrīsadīśhu rasanale segŏnna rusulĕlla
yīsudoḍa niṁduviూm̐da nĕṭṭurosedi

(||kaigŏṁṭe||)
goviṁdumāyale kūḍinaṭṭi panulĕlla
vevelai yiṁdunĕṭṭu vesaredi
śhrīveṁkaḍeśhum̐ḍe sittamulo dhyānamĕllā
pāvanamaidimi yim̐ka barasiṁta yedi