Kadunemu sedam juluganivaaramu

కడునేము చేతఁ జులుకనివారము
Language

(॥పల్లవి॥)
కడునేము చేతఁ జులుకనివారము
తడవకు మమ్మునిట్టే దయఁజూడవయ్యా

(॥కడు॥)
చెక్కునొక్కినంతలో చేరి వాదుకు వచ్చేవు
యిక్కువ గోరు దాఁకితే నేమందువో
ముక్కుననుండుఁ గోపము ముంచి నీవంటివానికి
నిక్కిమాతో నవ్వరాకు నీవెన్నఁడునయ్యా

(॥కడు॥)
మోము చూచినంతలోనే మొక్కలానఁ గసరేవు
యేమని నిన్నుఁ దిట్టినా నెంతసేతువో
దీమసమింతలేదు తేరి నీవంటి వానికి
కామించి మమ్ముఁ బట్టకు కైదప్పులౌనయ్యా

(॥కడు॥)
దగ్గరికి వచ్చినంతలో తమకించి దూరేవు
యెగ్గులు నిన్నెంచితేను యేమందువో
నిగ్గులు శ్రీవేంకటేశ నేఁడే నన్నుఁ గూడితివి
అగ్గపుటలమేల్‌మంగ నదెంచుకోవయ్యా

(||pallavi||)
kaḍunemu sedam̐ juluganivāramu
taḍavagu mammuniṭṭe dayam̐jūḍavayyā

(||kaḍu||)
sĕkkunŏkkinaṁtalo seri vādugu vachchevu
yikkuva goru dām̐kide nemaṁduvo
mukkunanuṁḍum̐ gobamu muṁchi nīvaṁṭivānigi
nikkimādo navvarāgu nīvĕnnam̐ḍunayyā

(||kaḍu||)
momu sūsinaṁtalone mŏkkalānam̐ gasarevu
yemani ninnum̐ diṭṭinā nĕṁtaseduvo
dīmasamiṁtaledu teri nīvaṁṭi vānigi
kāmiṁchi mammum̐ baṭṭagu kaidappulaunayyā

(||kaḍu||)
daggarigi vachchinaṁtalo tamagiṁchi dūrevu
yĕggulu ninnĕṁchidenu yemaṁduvo
niggulu śhrīveṁkaḍeśha nem̐ḍe nannum̐ gūḍidivi
aggabuḍalamel‌maṁga nadĕṁchugovayyā