Kadumgadu meludaanam ganaga nem jenagudu

కడుఁగడు మేలుదానఁ గనక నేఁ జెనకుదు
Language

(॥పల్లవి॥)
కడుఁగడు మేలుదానఁ గనక నేఁ జెనకుదు
యెడయ కేమందువో యేమిసేతునయ్యా

(॥కడు॥)
చన్నుల నిన్నొత్తఁగా చలమరింనందువో
కన్నుల సారెఁ జూడఁగా గబ్బినందువొ
పన్ని నీతోఁ బెనఁగితే పంతగతైనందువో
ఇన్నిటా నీమనసెట్టో యేమిసేతునయ్యా

(॥కడు॥)
కిలకిలనవ్వఁగాను కేరడములందువో
సోలసి చేయివట్టితే జూటనందువొ
పిలిచి మాటాడితేను పెనుఱట్టడి యందువో
యెంమి నీచిత్తమెట్టో యేమిసేతునయ్యా

(॥కడు॥)
అలరి మోవెడుగఁగా నాసొదకత్తెందువో
తెలివిఁ గాఁగిలించఁగా దిట్టనందువొ
కలసితి వలమేల్‌మంగాన శ్రీవేంకటేశుఁడ
యిల నీతలఁపు లెట్టో యేమిసేతునయ్యా

(||pallavi||)
kaḍum̐gaḍu meludānam̐ ganaga nem̐ jĕnagudu
yĕḍaya kemaṁduvo yemisedunayyā

(||kaḍu||)
sannula ninnŏttam̐gā salamariṁnaṁduvo
kannula sārĕm̐ jūḍam̐gā gabbinaṁduvŏ
panni nīdom̐ bĕnam̐gide paṁtagadainaṁduvo
inniḍā nīmanasĕṭṭo yemisedunayyā

(||kaḍu||)
kilagilanavvam̐gānu keraḍamulaṁduvo
solasi seyivaṭṭide jūḍanaṁduvŏ
pilisi māḍāḍidenu pĕnuṟaṭṭaḍi yaṁduvo
yĕṁmi nīsittamĕṭṭo yemisedunayyā

(||kaḍu||)
alari movĕḍugam̐gā nāsŏdagattĕṁduvo
tĕlivim̐ gām̐giliṁcham̐gā diṭṭanaṁduvŏ
kalasidi valamel‌maṁgāna śhrīveṁkaḍeśhum̐ḍa
yila nīdalam̐pu lĕṭṭo yemisedunayyā