కడుఁ జుట్టమవు నీవు కావంటినా
(॥పల్లవి॥)
కడుఁ జుట్టమవు నీవు కావంటినా
యెడయక నన్నునిట్టె యేలుమంటిఁ గాక
(॥కడు॥)
చెక్కునొక్కి నీవు నాచేయిమీఁదఁ జేయి వేసి
తక్కక నవ్వులు నవ్వఁగాఁ దగదంటినా
వొక్కతెపైఁ బెట్టి మాట వొక్కొక్కటి తడవఁగా
వక్కణించనంతేసి వద్దంటిఁ గాక
(॥కడు॥)
ఏపున నావద్దనుండి యింత కలసి మెలసి
కాఁపురము సేయఁగాను కాదంటినా
చూపి మోపి యాడోవారి సొమ్ములు మేనఁబెట్టుక
రాఁపులుసేయఁగా నందుకోపనంటిఁ గాక
(॥కడు॥)
చన్నులురమున రాయ సారెఁ గాఁగలించుకొని
యెన్నిచేఁతలు సేసినానేఁటికంటినా
అన్నిట శ్రీ వేంకటేశ అలమేల్మంగనే నేను
మన్నించి కూడితివిది మాననంటిఁ గాక
(||pallavi||)
kaḍum̐ juṭṭamavu nīvu kāvaṁṭinā
yĕḍayaga nannuniṭṭĕ yelumaṁṭim̐ gāga
(||kaḍu||)
sĕkkunŏkki nīvu nāseyimīm̐dam̐ jeyi vesi
takkaga navvulu navvam̐gām̐ dagadaṁṭinā
vŏkkadĕbaim̐ bĕṭṭi māḍa vŏkkŏkkaḍi taḍavam̐gā
vakkaṇiṁchanaṁtesi vaddaṁṭim̐ gāga
(||kaḍu||)
ebuna nāvaddanuṁḍi yiṁta kalasi mĕlasi
kām̐puramu seyam̐gānu kādaṁṭinā
sūbi mobi yāḍovāri sŏmmulu menam̐bĕṭṭuga
rām̐puluseyam̐gā naṁdugobanaṁṭim̐ gāga
(||kaḍu||)
sannuluramuna rāya sārĕm̐ gām̐galiṁchugŏni
yĕnnisem̐talu sesinānem̐ṭigaṁṭinā
anniḍa śhrī veṁkaḍeśha alamelmaṁgane nenu
manniṁchi kūḍidividi mānanaṁṭim̐ gāga