Kadum juttamavu neevu kaa vamtinaa

కడుఁ జుట్టమవు నీవు కా వంటినా
Language

(॥పల్లవి॥)
కడుఁ జుట్టమవు నీవు కా వంటినా
యెడయక నన్ను నిట్టె యేలుమంటిఁగాక

(॥కడుఁ॥)
చెక్కునొక్కి నీవు నాచేయిమీఁదఁ జేయివేసి
తక్కక నవ్వు నవ్వు నవ్వఁగాఁ దగదంటినా
వొక్కతెపైఁబెట్టి మాట వొక్కొక్కటె తడవఁగా
వక్కణించ నంతేసి వద్దంటిఁగాక

(॥కడు॥)
యేపున నావద్దనుండి ఇంతకలసిమెలసి
కాఁపురము సేయఁగాను కాదంటినా
చూపి మోపి యాడోవారిసొమ్ములు మేనఁబెట్టుక
రాఁపులు సేయఁగా నందు కోపనంటిఁగాక

(॥కడు॥)
చన్నులురమున రాయ సారెఁ గాఁగిలించుకొని
యెన్నిచేఁతలు సేసినా నేఁటికంటినా
అన్నిటా శ్రీవేంకటేశ అలమేల్మంగనే నేను
మన్నించి కూడితి విది మాననంటిఁగాక

(||pallavi||)
kaḍum̐ juṭṭamavu nīvu kā vaṁṭinā
yĕḍayaga nannu niṭṭĕ yelumaṁṭim̐gāga

(||kaḍum̐||)
sĕkkunŏkki nīvu nāseyimīm̐dam̐ jeyivesi
takkaga navvu navvu navvam̐gām̐ dagadaṁṭinā
vŏkkadĕbaim̐bĕṭṭi māḍa vŏkkŏkkaḍĕ taḍavam̐gā
vakkaṇiṁcha naṁtesi vaddaṁṭim̐gāga

(||kaḍu||)
yebuna nāvaddanuṁḍi iṁtagalasimĕlasi
kām̐puramu seyam̐gānu kādaṁṭinā
sūbi mobi yāḍovārisŏmmulu menam̐bĕṭṭuga
rām̐pulu seyam̐gā naṁdu kobanaṁṭim̐gāga

(||kaḍu||)
sannuluramuna rāya sārĕm̐ gām̐giliṁchugŏni
yĕnnisem̐talu sesinā nem̐ṭigaṁṭinā
anniḍā śhrīveṁkaḍeśha alamelmaṁgane nenu
manniṁchi kūḍidi vidi mānanaṁṭim̐gāga