కడుఁ జంచలములు కడు నధ్రువములు
(॥పల్లవి॥)
కడుఁ జంచలములు కడు నధ్రువములు
కడు నల్పములని కాదందురు
(॥కడుఁ॥)
కర్మభోధ వికారంబులు
ధర్మతంత్ర సంధానములు
దుర్మదైక సందోహములు
కర్మదూరు లివి గాదందురు
(॥కడుఁ॥)
పరమభాగవత భవ్యమతులు
పరమభోధ సంభావకులు
తిరువేంకటగిరిదేవు సేవకులు
కరుణాధికు లివి గాదందురు
(||pallavi||)
kaḍum̐ jaṁchalamulu kaḍu nadhruvamulu
kaḍu nalbamulani kādaṁduru
(||kaḍum̐||)
karmabhodha vigāraṁbulu
dharmadaṁtra saṁdhānamulu
durmadaiga saṁdohamulu
karmadūru livi gādaṁduru
(||kaḍum̐||)
paramabhāgavada bhavyamadulu
paramabhodha saṁbhāvagulu
tiruveṁkaḍagiridevu sevagulu
karuṇādhigu livi gādaṁduru