Kadum gomalamagu kaamta yidi

కడుఁ గోమలమగు కాంత యిది
Language

(॥పల్లవి॥)
కడుఁ గోమలమగు కాంత యిది
అడియాలపు ముద మందించరాదా

(॥కడు॥)
మొక్కులు మొక్కుచు మోము చూడఁగా
వుక్కుగోర నటు వూఁదితివి
యిక్కడ సతి మతి నేమని వున్నదొ
చక్కఁగ నూరడించఁగరాదా

(॥కడు॥)
కలకల నవ్వుచు కానుకియ్యఁగా
బలిమిఁ బెనఁగి యటు పదరితివి
అలసి యెంత తురుమదవద లాయనొ
మలసి లాలింపుచు మన్నించరాదా

(॥కడు॥)
సేవలు సేయుచు చిడుముడి పడఁగా
కావిరిఁ గాఁగిటఁ గలసితివి
శ్రీవేంకటేశ్వర సిగ్గెటులుండెనొ
యీ విధముల నిటు యీడేర్చరాదా

(||pallavi||)
kaḍum̐ gomalamagu kāṁta yidi
aḍiyālabu muda maṁdiṁcharādā

(||kaḍu||)
mŏkkulu mŏkkusu momu sūḍam̐gā
vukkugora naḍu vūm̐didivi
yikkaḍa sadi madi nemani vunnadŏ
sakkam̐ga nūraḍiṁcham̐garādā

(||kaḍu||)
kalagala navvusu kānugiyyam̐gā
balimim̐ bĕnam̐gi yaḍu padaridivi
alasi yĕṁta turumadavada lāyanŏ
malasi lāliṁpusu manniṁcharādā

(||kaḍu||)
sevalu seyusu siḍumuḍi paḍam̐gā
kāvirim̐ gām̐giḍam̐ galasidivi
śhrīveṁkaḍeśhvara siggĕḍuluṁḍĕnŏ
yī vidhamula niḍu yīḍersarādā