కడుఁ బెలుచుగుణములది గదె యమ్మ యీకొమ్మ
(॥పల్లవి॥)
కడుఁ బెలుచుగుణములది గదె యమ్మ యీకొమ్మ
యెడలేక ఇఁక నెంత యేలునో పతిని
(॥కడు॥)
పోదలఁ బుక్కిటినిండ పాలితి తములము నించి
పెదవులను మాటాడెఁ బ్రియునితోడ
వుదుటుగర్వము యించ నొక్క చెలిపై నొరగి
కదలుఁగన్నుల నవ్వెఁగదె మరియుఁ బతిని
(॥కడు॥)
అచటఁ బావాలు వోయ్యారముగ మెట్టుకొని
పచరించె మాటలనె పంత మితని
కుచములెడఁ బయ్యఁటకొంగు వల్లెవాటు గొని
రచన నొకచే మొక్కె రాజసానఁ బతికి
(॥కడు॥)
కొప్పువూవులు వీడి కొంతగొంత రాలఁగాఁ
గప్పుచు శ్రీవేంకటేశుఁ గాఁగిలించెను
దప్పిదేరుమోవితోడ తనిసీఁ దనియనిరతుల
యిప్పుడే వురమెక్కె నెనయుచుఁ బతిని
(||pallavi||)
kaḍum̐ bĕlusuguṇamuladi gadĕ yamma yīgŏmma
yĕḍalega im̐ka nĕṁta yeluno padini
(||kaḍu||)
podalam̐ bukkiḍiniṁḍa pālidi tamulamu niṁchi
pĕdavulanu māḍāḍĕm̐ briyunidoḍa
vuduḍugarvamu yiṁcha nŏkka sĕlibai nŏragi
kadalum̐gannula navvĕm̐gadĕ mariyum̐ badini
(||kaḍu||)
asaḍam̐ bāvālu voyyāramuga mĕṭṭugŏni
pasariṁchĕ māḍalanĕ paṁta midani
kusamulĕḍam̐ bayyam̐ṭagŏṁgu vallĕvāḍu gŏni
rasana nŏgase mŏkkĕ rājasānam̐ badigi
(||kaḍu||)
kŏppuvūvulu vīḍi kŏṁtagŏṁta rālam̐gām̐
gappusu śhrīveṁkaḍeśhum̐ gām̐giliṁchĕnu
dappiderumovidoḍa tanisīm̐ daniyaniradula
yippuḍe vuramĕkkĕ nĕnayusum̐ badini