(॥పల్లవి॥)
కడుఁ బసిబాలుఁడలవు కటకటా
యెడతాఁకి బడలితి విటువలెఁ గలదా
(॥కడు బసి॥)
యేయడనుండి నా యన్న యిపు డాడి వచ్చితివి
కాయ మెల్లఁ జెమరించెఁ గటకటా
బాయిట నాడుతా నెంత పరువులు వెట్టితివో
యీయెడ బుస కొట్టేవు యిటువలెఁ గలదా
(॥కడుబసి॥)
విందుల నెవ్వరియింట వేఁడిపా లారగించితి
కందువ నీ మోవి వొక్కెఁ గటకటా
మందలించి యా డేడ మడుగులు చొచ్చితివో
యందు నీమై గరుపారె నిటువలెఁ గలదా
(॥కడుబసి॥)
యెన్నెన్నిచోట్ల నీవు యేమి సేసి అలసితో
కన్నుల నిద్దుర దేరీఁ గటకటా
పన్నిన శ్రీవెంకటాద్రి బాలుఁడ వై నవ్వేవు
యిన్ని నీవే యెరుఁగుదు విటువలెఁ గలదా
(||pallavi||)
kaḍum̐ basibālum̐ḍalavu kaḍagaḍā
yĕḍadām̐ki baḍalidi viḍuvalĕm̐ galadā
(||kaḍu basi||)
yeyaḍanuṁḍi nā yanna yibu ḍāḍi vachchidivi
kāya mĕllam̐ jĕmariṁchĕm̐ gaḍagaḍā
bāyiḍa nāḍudā nĕṁta paruvulu vĕṭṭidivo
yīyĕḍa busa kŏṭṭevu yiḍuvalĕm̐ galadā
(||kaḍubasi||)
viṁdula nĕvvariyiṁṭa vem̐ḍibā lāragiṁchidi
kaṁduva nī movi vŏkkĕm̐ gaḍagaḍā
maṁdaliṁchi yā ḍeḍa maḍugulu sŏchchidivo
yaṁdu nīmai garubārĕ niḍuvalĕm̐ galadā
(||kaḍubasi||)
yĕnnĕnnisoṭla nīvu yemi sesi alasido
kannula niddura derīm̐ gaḍagaḍā
pannina śhrīvĕṁkaḍādri bālum̐ḍa vai navvevu
yinni nīve yĕrum̐gudu viḍuvalĕm̐ galadā