కడుగోల యీ చెలి కరుణించు మిఁక నీవు
(॥పల్లవి॥)
కడుగోల యీ చెలి కరుణించు మిఁక నీవు
అడియాలపు నవ్వులే అచ్చివచ్చు మీకును
(॥కడు॥)
వింత సేయవద్దుగాని వేడుకతో నాఁటదాని
నెంత సోఁకఁ బలికినా ఇతవే కాదా
ఇంతటివాఁడవు నీవు ఇంటికి వచ్చితేఁ జాలు
దొంతి నున్న వలపులే తోడయ్యీ మీకును
(॥కడు॥)
సిగ్గు వడవద్దుగాని సేసకు లోనైనదాని
అగ్గల మెంత నవ్వినా అరుదే కాదా
కగ్గులేని చట్టమవు కాయము ముట్టితేఁ జాలు
వొగ్గి తమకములే మేలొనరించీ మీకును
(॥కడు॥)
మఱవఁగవద్దు గాని మనసువచ్చినదాని
తఱి నెంతఁ గూడినాను తగవే కాదా
యెఱిఁగి శ్రీ వేంకటేశ యేలితివి మా చెలిని
జఱసి జాణతనాలే చవి చూపె మీకును
(||pallavi||)
kaḍugola yī sĕli karuṇiṁchu mim̐ka nīvu
aḍiyālabu navvule achchivachchu mīgunu
(||kaḍu||)
viṁta seyavaddugāni veḍugado nām̐ṭadāni
nĕṁta som̐kam̐ baliginā idave kādā
iṁtaḍivām̐ḍavu nīvu iṁṭigi vachchidem̐ jālu
dŏṁti nunna valabule toḍayyī mīgunu
(||kaḍu||)
siggu vaḍavaddugāni sesagu lonainadāni
aggala mĕṁta navvinā arude kādā
kagguleni saṭṭamavu kāyamu muṭṭidem̐ jālu
vŏggi tamagamule melŏnariṁchī mīgunu
(||kaḍu||)
maṟavam̐gavaddu gāni manasuvachchinadāni
taṟi nĕṁtam̐ gūḍinānu tagave kādā
yĕṟim̐gi śhrī veṁkaḍeśha yelidivi mā sĕlini
jaṟasi jāṇadanāle savi sūbĕ mīgunu