కడుదూరకురే మీరు ఘనుఁ డాతఁడు
(॥పల్లవి॥)
కడుదూరకురే మీరు ఘనుఁ డాతఁడు
కడమ తమకమెల్లాఁ గానవచ్చీ నిపుడు
(॥కడు॥)
సెలవి నవ్వినవాఁడు చేయి చాఁచకుండునా
పిలువనేలే తానే ప్రేమసేసీని
పలుకనట్టే వుండు బత్తి నాపైఁ గలఁడు
పశువులవలపులుసన్నల నెఱఁగనా
(॥కడు॥)
కన్నుల జూచినవాఁడు కాతరించకుండునా
పన్ని యెచ్చకించకురే పైకొనీఁ దానే
మిన్నక పరాకైనా మన్నన నాకే వొసఁగు
కన్నెరికపుమదము కంటే నెఱఁగనా
(॥కడు॥)
కదిసి కూచున్నవాఁడు కాఁగిలించకుండునా
వదరకురే కూడి బాసయిచ్చీని
ఇదివో శ్రీవేంకటేశుఁ డేలె నన్ను నిన్నిటాను
పెదవిపై గుఱుతులు పెట్టె నాఁ డెఱఁగనా
(||pallavi||)
kaḍudūragure mīru ghanum̐ ḍādam̐ḍu
kaḍama tamagamĕllām̐ gānavachchī nibuḍu
(||kaḍu||)
sĕlavi navvinavām̐ḍu seyi sām̐saguṁḍunā
piluvanele tāne premasesīni
paluganaṭṭe vuṁḍu batti nābaim̐ galam̐ḍu
paśhuvulavalabulusannala nĕṟam̐ganā
(||kaḍu||)
kannula jūsinavām̐ḍu kādariṁchaguṁḍunā
panni yĕchchagiṁchagure paigŏnīm̐ dāne
minnaga parāgainā mannana nāge vŏsam̐gu
kannĕrigabumadamu kaṁṭe nĕṟam̐ganā
(||kaḍu||)
kadisi kūsunnavām̐ḍu kām̐giliṁchaguṁḍunā
vadaragure kūḍi bāsayichchīni
idivo śhrīveṁkaḍeśhum̐ ḍelĕ nannu ninniḍānu
pĕdavibai guṟudulu pĕṭṭĕ nām̐ ḍĕṟam̐ganā