Kadu veragayyee neebe kadagaaridanaalagu

కడు వెరగయ్యీ నీపె కతకారితనాలకు
Language

(॥పల్లవి॥)
కడు వెరగయ్యీ నీపె కతకారితనాలకు
బడిబడిఁ జిత్తగించి భావించుకోవయ్యా

(॥కడు॥)
వేడుకతో నాపె వినయపుమాఁటలాడీ
యేడ నేరిచెనోకాని యీ వేసాలు
వూడిగా లెల్లాఁ జేసి వొద్దనే కాచుకున్నది
జాడతో యిందుకే యెంత చదివినోకాని

(॥కడు॥)
అందుకొని సేవసేసి ఆస నీకుఁ బెడరేఁచీ
యెందుండి తెచ్చుకొనెనో యీనయాలు
పొందుగా నేపొద్దు నీపైఁ బొంచిపొంచి బత్తిసేసీ
చెంది ఇందుకెంత సాముసేసెనోకాని

(॥కడు॥)
సన్నలు సేసి నీమోము సారెఁ జూచి నవ్వీని
యెన్నఁడు సాదించెనో యీమాయలు
నన్ను నిట్టె కూడితివి నంటున శ్రీ వేంకటేశ
నున్నఁగాఁ దా యిందుకెంత నోమెనోకాని

(||pallavi||)
kaḍu vĕragayyī nībĕ kadagāridanālagu
baḍibaḍim̐ jittagiṁchi bhāviṁchugovayyā

(||kaḍu||)
veḍugado nābĕ vinayabumām̐ṭalāḍī
yeḍa nerisĕnogāni yī vesālu
vūḍigā lĕllām̐ jesi vŏddane kāsugunnadi
jāḍado yiṁduge yĕṁta sadivinogāni

(||kaḍu||)
aṁdugŏni sevasesi āsa nīgum̐ bĕḍarem̐sī
yĕṁduṁḍi tĕchchugŏnĕno yīnayālu
pŏṁdugā nebŏddu nībaim̐ bŏṁchibŏṁchi battisesī
sĕṁdi iṁdugĕṁta sāmusesĕnogāni

(||kaḍu||)
sannalu sesi nīmomu sārĕm̐ jūsi navvīni
yĕnnam̐ḍu sādiṁchĕno yīmāyalu
nannu niṭṭĕ kūḍidivi naṁṭuna śhrī veṁkaḍeśha
nunnam̐gām̐ dā yiṁdugĕṁta nomĕnogāni