కడు వేడుక లీడేరెఁ గాంత నీవు గలందుకు
(॥పల్లవి॥)
కడు వేడుక లీడేరెఁ గాంత నీవు గలందుకు
తడయ కెప్పుడూ నా దండ నుండఁ గదవే
(॥కడు॥)
ఆతని చక్కఁదనాలు అప్పటనుండిఁ జెప్పేవు
చూతము తోడితేనే సుదతి
పోతరించి వచ్చేనంటే పొంచి మావా రేమందురో
దూతికవు నీవే పొందులు సేయఁగదవే
(॥కడు॥)
వీడెమిచ్చి పంపేనంటా వెస నా చేతికిచ్చేవు
జోడు గూడఁ జేయఁగదే సుదతి
గోడ నిక్కిచూచేనంటా కొప్పుజారునో యేమో
యీడైన చెలికత్తెవు యిద్దరిఁ గూడించవే
(॥కడు॥)
తెరలోనున్నాఁడంటా దిష్టముగాఁ జూపేవు
సొరిదిఁ బెండ్లి సేయవే సుదతి
యిరవై శ్రీవేంకటేశుఁ డితఁ డిట్టె నన్ను నేలె
పరగు సంగాతివి సోబానఁ బాడఁగదవే
(||pallavi||)
kaḍu veḍuga līḍerĕm̐ gāṁta nīvu galaṁdugu
taḍaya kĕppuḍū nā daṁḍa nuṁḍam̐ gadave
(||kaḍu||)
ādani sakkam̐danālu appaḍanuṁḍim̐ jĕppevu
sūdamu toḍidene sudadi
podariṁchi vachchenaṁṭe pŏṁchi māvā remaṁduro
dūdigavu nīve pŏṁdulu seyam̐gadave
(||kaḍu||)
vīḍĕmichchi paṁpenaṁṭā vĕsa nā sedigichchevu
joḍu gūḍam̐ jeyam̐gade sudadi
goḍa nikkisūsenaṁṭā kŏppujāruno yemo
yīḍaina sĕligattĕvu yiddarim̐ gūḍiṁchave
(||kaḍu||)
tĕralonunnām̐ḍaṁṭā diṣhṭamugām̐ jūbevu
sŏridim̐ bĕṁḍli seyave sudadi
yiravai śhrīveṁkaḍeśhum̐ ḍidam̐ ḍiṭṭĕ nannu nelĕ
paragu saṁgādivi sobānam̐ bāḍam̐gadave