కడు సిగ్గులు వడితే కలసే లా గెట్లానే
(॥పల్లవి॥)
కడు సిగ్గులు వడితే కలసే లా గెట్లానే
చిడిముడి నెన్నాళ్ళైనాఁ జిన్నదానవా
(॥॥)
కాంతుఁడు నీతోఁ దానే కదిసి మాటాడఁగాను
మంతనమాడే వేమే మాతో నీవు
చింత నాతఁడే నీపైఁ జిమ్ముఁ జూపులు చిమ్మఁగా
యింతలో మా మోము చూచే విది యేమే నీవు
(॥॥)
పలుమారు నీ విభుఁడు పక పక నవ్వఁగాను
సెలవుల నవ్వే వేలే చేరి మాతోను
బలిమి నాతఁడు నీ పయ్యద కొంగంటితేను
యిల మా యండకు వచ్చే వేఁటిదే నీవు
(॥॥)
శ్రీ వేంకటేశుఁడు నిన్నుఁ జెంది సొమ్ము లిచ్చితేను
యీవల మా కిచ్చేవు యిదేమే నేఁడు
నీ వలిమేలుమంగవు ని న్నేలె నాతఁ డింతలో
యేవల మమ్మేలితివి యే మనేమే నేము
(||pallavi||)
kaḍu siggulu vaḍide kalase lā gĕṭlāne
siḍimuḍi nĕnnāḽḽainām̐ jinnadānavā
(||||)
kāṁtum̐ḍu nīdom̐ dāne kadisi māḍāḍam̐gānu
maṁtanamāḍe veme mādo nīvu
siṁta nādam̐ḍe nībaim̐ jimmum̐ jūbulu simmam̐gā
yiṁtalo mā momu sūse vidi yeme nīvu
(||||)
palumāru nī vibhum̐ḍu paga paga navvam̐gānu
sĕlavula navve vele seri mādonu
balimi nādam̐ḍu nī payyada kŏṁgaṁṭidenu
yila mā yaṁḍagu vachche vem̐ṭide nīvu
(||||)
śhrī veṁkaḍeśhum̐ḍu ninnum̐ jĕṁdi sŏmmu lichchidenu
yīvala mā kichchevu yideme nem̐ḍu
nī valimelumaṁgavu ni nnelĕ nādam̐ ḍiṁtalo
yevala mammelidivi ye maneme nemu