కడు నిన్ను దూరవద్దు గర్వము తగవెంచదు
(॥పల్లవి॥)
కడు నిన్ను దూరవద్దు గర్వము తగవెంచదు
బడినున్న తరితీపు పంత మెంచదు
(॥కడు॥)
మిక్కుటపుఁ దమకము మీఁదుగిందు మెంచదు
వెక్కసపుటడియాస వేసటెంచదు
యెక్కవైన మోహము యెగ్గుసిగ్గు లెంచదు
పిక్కటిల్లిన చలము ప్రియ మెంచదు
(॥కడు॥)
వీడనిచుట్టరికము వింతతన మెంచదు
వేడుక యెదిరివల్ల వెరపెంచదు
వోడక వైరము మొగమోటమేమీనెంచదు
యీడైన కూటమి అలయిక నెంచదు
(॥కడు॥)
మనసులో తలపోఁత మరియేమీనెంచదు
గొనకొన్నరతికేళి కొలదెంచదు
యెనసితి విటు నన్ను యిదివో శ్రీవేంకటేశ
తనివోని సరసము తప్పేమీనెంచదు
(||pallavi||)
kaḍu ninnu dūravaddu garvamu tagavĕṁchadu
baḍinunna taridību paṁta mĕṁchadu
(||kaḍu||)
mikkuḍabum̐ damagamu mīm̐dugiṁdu mĕṁchadu
vĕkkasabuḍaḍiyāsa vesaḍĕṁchadu
yĕkkavaina mohamu yĕggusiggu lĕṁchadu
pikkaḍillina salamu priya mĕṁchadu
(||kaḍu||)
vīḍanisuṭṭarigamu viṁtadana mĕṁchadu
veḍuga yĕdirivalla vĕrabĕṁchadu
voḍaga vairamu mŏgamoḍamemīnĕṁchadu
yīḍaina kūḍami alayiga nĕṁchadu
(||kaḍu||)
manasulo talabom̐ta mariyemīnĕṁchadu
gŏnagŏnnaradigeḽi kŏladĕṁchadu
yĕnasidi viḍu nannu yidivo śhrīveṁkaḍeśha
tanivoni sarasamu tappemīnĕṁchadu