Kadu ninnu dooranoba kaaneevayyaa

కడు నిన్ను దూరనోప కానీవయ్యా
Language

(॥పల్లవి॥)
కడు నిన్ను దూరనోప కానీవయ్యా
కడమ లిన్నియుఁ బాసెఁ గానీవయ్యా

(॥కడు॥)
నీ కితవైతేఁజాలు నీనెలఁత లేమన్న
కైకొనేము అందుకేమి కానీవయ్యా
ఆకెకు నీవు వలపు ఆకె నీకు వలవనీ
కాకు సేయకుంటేఁజాలుఁ గానీవయ్యా

(॥కడు॥)
యింటి వచ్చిన మేలు యేడ నుండినా మేలు
కంటిమి నీగుణమెల్లా గానీవయ్య
నంటున నిట్టె నవ్వు నవ్వకుంటే యాకెఁ జూపి
కంటకాలాడు చాలుఁ గానీవయ్యా

(॥కడు॥)
మాఁగినకోపము దీర మాఁటల బుజ్జగించితి
కాఁగినకాఁకలు జారెఁ గానీవయ్యా
పాఁగి నీకు సతమయి పరచిత్తము మానితి
కాఁగిన శ్రీవేంకటేశ కానీవయ్యా

(||pallavi||)
kaḍu ninnu dūranoba kānīvayyā
kaḍama linniyum̐ bāsĕm̐ gānīvayyā

(||kaḍu||)
nī kidavaidem̐jālu nīnĕlam̐ta lemanna
kaigŏnemu aṁdugemi kānīvayyā
āgĕgu nīvu valabu āgĕ nīgu valavanī
kāgu seyaguṁṭem̐jālum̐ gānīvayyā

(||kaḍu||)
yiṁṭi vachchina melu yeḍa nuṁḍinā melu
kaṁṭimi nīguṇamĕllā gānīvayya
naṁṭuna niṭṭĕ navvu navvaguṁṭe yāgĕm̐ jūbi
kaṁṭagālāḍu sālum̐ gānīvayyā

(||kaḍu||)
mām̐ginagobamu dīra mām̐ṭala bujjagiṁchidi
kām̐ginagām̐kalu jārĕm̐ gānīvayyā
pām̐gi nīgu sadamayi parasittamu mānidi
kām̐gina śhrīveṁkaḍeśha kānīvayyā