కడు నేరుపరినంటా గర్వించేవు
(॥పల్లవి॥)
కడు నేరుపరినంటా గర్వించేవు
జడియక యీ వలపు సంగ తెరిఁగించవే
(॥కడు॥)
మాటలాడనేరుతువు మనసుకు మర్మమేదే
ఆఁటదాన విదెఱఁగనంటేఁ గొరత
యీటున నాతఁడు నీవు నిద్దరొ(రు) వొక్కరై
కూటపు నీ భారములగుఱుతెరిఁగించవే
(॥కడు॥)
సుద్దులన్ని నేరుతువు చూపులకు సూటేదే
కొద్దిమీరి ఇదెఱఁగకుంటే గొరత
చద్దిపండో వేఁడిపండో సరుస మీమోవులు
తిద్దుకొని నన్ను సమ్మతించఁ జేయవే
(॥కడు॥)
ముదురు జాణవు నీవు మోహానకుఁ జోటేదే
ఇది యెఱఁగకవుంటే ఇంతాఁ గొరత
కదిసి కూడె శ్రీ వేంకటేశుఁడు నిన్ను నన్ను
విదయ చందురులకు వేళ చెప్పవే
(||pallavi||)
kaḍu nerubarinaṁṭā garviṁchevu
jaḍiyaga yī valabu saṁga tĕrim̐giṁchave
(||kaḍu||)
māḍalāḍaneruduvu manasugu marmamede
ām̐ṭadāna vidĕṟam̐ganaṁṭem̐ gŏrada
yīḍuna nādam̐ḍu nīvu niddarŏ(ru) vŏkkarai
kūḍabu nī bhāramulaguṟudĕrim̐giṁchave
(||kaḍu||)
suddulanni neruduvu sūbulagu sūḍede
kŏddimīri idĕṟam̐gaguṁṭe gŏrada
saddibaṁḍo vem̐ḍibaṁḍo sarusa mīmovulu
tiddugŏni nannu sammadiṁcham̐ jeyave
(||kaḍu||)
muduru jāṇavu nīvu mohānagum̐ joḍede
idi yĕṟam̐gagavuṁṭe iṁtām̐ gŏrada
kadisi kūḍĕ śhrī veṁkaḍeśhum̐ḍu ninnu nannu
vidaya saṁdurulagu veḽa sĕppave