కడు మొగమోటదాన గట్టిగాఁ దెలిసితివా
(॥పల్లవి॥)
కడు మొగమోటదాన గట్టిగాఁ దెలిసితివా
చిడిముడి వినయమే సేయవలె నాకు
(॥॥)
చెప్పిన నీ మాటలు చెలియరో నేవింటి
వొప్పెనా రమణుఁడు నీ వొడఁబాటులు
చిప్పిల నే నాఁటదాన సిగ్గవును పతివద్ద
అప్పుడు మీఱితే నేమి ననరాదు నాకు
(॥॥)
నీ వేమి సేయు మనినా నే నిట్టే సమ్మతించితి
ఆవల నాతని కింపులై వుండునా
వే వేలైనా నిల్లాలికి వెరగవును తనవద్ద
ఆవేళఁ దా నెట్టుండినా ననరాదు నాకు
(॥॥)
చేరి కూడుమనఁ గాను శ్రీ వేంకటేశుఁ గూడితి
యీ రీతి నాతని కోర్కి యీడేర్చితివా
సారె సారె దేవులను సంతోము నా కేది
ఆరితేరెఁ బను లిఁక ననరాదు నాకు
(||pallavi||)
kaḍu mŏgamoḍadāna gaṭṭigām̐ dĕlisidivā
siḍimuḍi vinayame seyavalĕ nāgu
(||||)
sĕppina nī māḍalu sĕliyaro neviṁṭi
vŏppĕnā ramaṇum̐ḍu nī vŏḍam̐bāḍulu
sippila ne nām̐ṭadāna siggavunu padivadda
appuḍu mīṟide nemi nanarādu nāgu
(||||)
nī vemi seyu maninā ne niṭṭe sammadiṁchidi
āvala nādani kiṁpulai vuṁḍunā
ve velainā nillāligi vĕragavunu tanavadda
āveḽam̐ dā nĕṭṭuṁḍinā nanarādu nāgu
(||||)
seri kūḍumanam̐ gānu śhrī veṁkaḍeśhum̐ gūḍidi
yī rīdi nādani korgi yīḍersidivā
sārĕ sārĕ devulanu saṁtomu nā kedi
āriderĕm̐ banu lim̐ka nanarādu nāgu