Kadu gattigumde neegum gaamgaam gaaga

కడు గట్టిగుండె నీకుఁ గాఁగాఁ గాక
Language

(॥పల్లవి॥)
కడు గట్టిగుండె నీకుఁ గాఁగాఁ గాక
అడరి పాయపువారి కంతేసి చెల్లునా

(॥కడు గట్టి॥)
పంతము దప్పినఁ దప్పీ పక్కన నవ్వేవు సుమ్మీ
యింతిరో నిన్నటిమాట కిపుడు నీవు
చెంతల నే మిందరము చేరి వేఁడుకోఁ గాను
కాంతునిఁ గాఁగిట నిట్టె కలయఁగ వలదా

(॥కడు గట్టి॥)
మంకులు దీరినాఁ దీరీ మాట లూఁకొనేవు సుమ్మీ
వుంకువగా రాతిరింటివొట్లకును
సంకె దీర మీతగవు సరిగా నే తేర్చఁ గాను
యింకా నేల అలుకలు యియ్యకొన వలదా

(॥కడుగట్టి॥)
సిగ్గులు వీడినా వీడీ సిరసు యెత్తేవు సుమ్మీ
అగ్గ మై శ్రీవెంకటేశుఁడ డండ నున్నాఁడు
వెగ్గళిం చాతఁడే నిన్ను వేఁడుక కాఁగిటఁ గూడె
నిగ్గుల మమ్మిక మెచ్చి నిండుకొన వలదా

(||pallavi||)
kaḍu gaṭṭiguṁḍĕ nīgum̐ gām̐gām̐ gāga
aḍari pāyabuvāri kaṁtesi sĕllunā

(||kaḍu gaṭṭi||)
paṁtamu dappinam̐ dappī pakkana navvevu summī
yiṁtiro ninnaḍimāḍa kibuḍu nīvu
sĕṁtala ne miṁdaramu seri vem̐ḍugom̐ gānu
kāṁtunim̐ gām̐giḍa niṭṭĕ kalayam̐ga valadā

(||kaḍu gaṭṭi||)
maṁkulu dīrinām̐ dīrī māḍa lūm̐kŏnevu summī
vuṁkuvagā rādiriṁṭivŏṭlagunu
saṁkĕ dīra mīdagavu sarigā ne tersam̐ gānu
yiṁkā nela alugalu yiyyagŏna valadā

(||kaḍugaṭṭi||)
siggulu vīḍinā vīḍī sirasu yĕttevu summī
agga mai śhrīvĕṁkaḍeśhum̐ḍa ḍaṁḍa nunnām̐ḍu
vĕggaḽiṁ sādam̐ḍe ninnu vem̐ḍuga kām̐giḍam̐ gūḍĕ
niggula mammiga mĕchchi niṁḍugŏna valadā