కడు దంటగాదు సతి గంభీర నాయకురాలు
(॥పల్లవి॥)
కడు దంటగాదు సతి గంభీర నాయకురాలు
చిడుముడితో నిది చిత్తగించవయ్యా
(॥॥)
సెలవి నవ్విన నవ్వు సిగ్గులకు మూలము
చలములకు గురుతు జంకెనలు
వలపులకు మొదలు వద్దఁ బాయకుండుటలు
చెలియందే వున్నవివి చిత్తగించవయ్యా
(॥॥)
కన్నులు మొక్కిన మొక్కు కాంక్షలకు మూలము
విన్నపాలకు గురుతు వినయములు
ఇన్ని మన్ననల మొదలిచ్చకఁపు మాటలు
చెన్నుమీఱ నీకెందే చిత్తగించవయ్యా
(॥॥)
ఆసలకు మూలము ఆయము లంటుట యెల్ల
వాసివన్నెకు గురుతు వట్టిగుట్లు
వేసాలఁ గూడితివి శ్రీవేంకటాద్రి గోవిందుఁడ
శ్రీసతిని యీపె మేలు చిత్తగించవయ్యా
(||pallavi||)
kaḍu daṁṭagādu sadi gaṁbhīra nāyagurālu
siḍumuḍido nidi sittagiṁchavayyā
(||||)
sĕlavi navvina navvu siggulagu mūlamu
salamulagu gurudu jaṁkĕnalu
valabulagu mŏdalu vaddam̐ bāyaguṁḍuḍalu
sĕliyaṁde vunnavivi sittagiṁchavayyā
(||||)
kannulu mŏkkina mŏkku kāṁkṣhalagu mūlamu
vinnabālagu gurudu vinayamulu
inni mannanala mŏdalichchagam̐pu māḍalu
sĕnnumīṟa nīgĕṁde sittagiṁchavayyā
(||||)
āsalagu mūlamu āyamu laṁṭuḍa yĕlla
vāsivannĕgu gurudu vaṭṭiguṭlu
vesālam̐ gūḍidivi śhrīveṁkaḍādri goviṁdum̐ḍa
śhrīsadini yībĕ melu sittagiṁchavayyā