(॥పల్లవి॥)
కదిసినమీఁద నింకఁ గడమలేల
చెదరె నలుకలెల్ల చిత్తగించు చెలిని
(॥కది॥)
కొమ్మమతి కోరికలు కోటానఁగోట్లై
కుమ్మరించీ నీమీఁది కొనచూపుల
దిమ్ముఁగాఁకలే సారెఁ డెగనినిట్టూరుపుల
చిమ్మఁజొచ్చె నిఁకనేల చిత్తగించు చెలిని
(॥కది॥)
వనిత తమకమెల్ల వడిఁబెట్టీ నీమీఁద
చినుకు చిత్తడిమేనిచెమటలను
నినుపువిరహమున నివ్వెరగై నేఁడు
జినుగాయఁ దాలిములు చిత్తగించు చెలిని
(॥కది॥)
తరుణినేరుపులెల్లఁ దండోపతండాలై
దొరయఁ గాఁగిటిలోనే తోడుచూపీని
యిరవుగ శ్రీవేంకటేశ కూడితి విట్టె
మరిగి తరములేక మన్నించు చెలిని
(||pallavi||)
kadisinamīm̐da niṁkam̐ gaḍamalela
sĕdarĕ nalugalĕlla sittagiṁchu sĕlini
(||kadi||)
kŏmmamadi korigalu koḍānam̐goṭlai
kummariṁchī nīmīm̐di kŏnasūbula
dimmum̐gām̐kale sārĕm̐ ḍĕganiniṭṭūrubula
simmam̐jŏchchĕ nim̐kanela sittagiṁchu sĕlini
(||kadi||)
vanida tamagamĕlla vaḍim̐bĕṭṭī nīmīm̐da
sinugu sittaḍimenisĕmaḍalanu
ninubuvirahamuna nivvĕragai nem̐ḍu
jinugāyam̐ dālimulu sittagiṁchu sĕlini
(||kadi||)
taruṇinerubulĕllam̐ daṁḍobadaṁḍālai
dŏrayam̐ gām̐giḍilone toḍusūbīni
yiravuga śhrīveṁkaḍeśha kūḍidi viṭṭĕ
marigi taramulega manniṁchu sĕlini