కద్దు లేదనఁగ నేల కమ్మటిఁ దాను
(॥పల్లవి॥)
కద్దు లేదనఁగ నేల కమ్మటిఁ దాను
యిద్దరు సతుల పొందూ నీడేరె ననవే
(॥కద్దు॥)
సందడినాపెతోడ సరసము లాడీఁ దాను
అందుకు నాతో మాట లాడు మనవే
గొందిఁ జిక్కించుక మిమ్ము గుట్టున నొడఁ బరచీ
కందువ నేఁదెలి పే నిక్కడికి రమ్మనవే
(॥కద్దు॥)
ఎట్టిదో ఆపెగురుతు యెఱఁగ ననీఁ దాను
చుట్టమైన దీకె మోము చూడు మనవే
మట్టుమీర నవ్వి మిమ్ము మాఁటాలు మరపించీని
పట్టితిఁ దనలేక లంపఁగా విను మనవే
(॥కద్దు॥)
తనదేవులై వుండఁగాఁ దలఁచుకొనీఁ దాను
గొనకొని యింకా నేల కూడు మనవే
నను నేలె మిమ్ముఁ జూచి నగీ శ్రీవేంకటేశుఁడు
పనిలేనిచలములు పట్టఁగ వద్దనవే
(||pallavi||)
kaddu ledanam̐ga nela kammaḍim̐ dānu
yiddaru sadula pŏṁdū nīḍerĕ nanave
(||kaddu||)
saṁdaḍinābĕdoḍa sarasamu lāḍīm̐ dānu
aṁdugu nādo māḍa lāḍu manave
gŏṁdim̐ jikkiṁchuga mimmu guṭṭuna nŏḍam̐ barasī
kaṁduva nem̐dĕli pe nikkaḍigi rammanave
(||kaddu||)
ĕṭṭido ābĕgurudu yĕṟam̐ga nanīm̐ dānu
suṭṭamaina dīgĕ momu sūḍu manave
maṭṭumīra navvi mimmu mām̐ṭālu marabiṁchīni
paṭṭidim̐ danalega laṁpam̐gā vinu manave
(||kaddu||)
tanadevulai vuṁḍam̐gām̐ dalam̐sugŏnīm̐ dānu
gŏnagŏni yiṁkā nela kūḍu manave
nanu nelĕ mimmum̐ jūsi nagī śhrīveṁkaḍeśhum̐ḍu
panilenisalamulu paṭṭam̐ga vaddanave