కడవారు చెప్పితేను కడువెంగెమై వుండు
(॥పల్లవి॥)
కడవారు చెప్పితేను కడువెంగెమై వుండు
అడరి నీ చేతులనే అంటి చూచుకోవయ్యా
(॥కడ॥)
వనితచెవుల నున్న వజ్రాల కమ్మలవొత్తు -
లొనర నీచెక్కులపై నున్నవి నేడు
మునుకొన్నవలపుల ముద్రలవె నున్నవి
తనర కు నివే యద్దము చూచుకోవయ్యా
(॥కడ॥)
కాంతనుదుట నున్నకస్తూరి వట్రున బొట్టు
అంతలోనే నీనొసల నంటివున్నది
చెంత నీరతికి నీలచ్చెన గురుతైవునది
వింతగా గోర గీరి వీవే చూచుకోవయ్యా
(॥కడ॥)
కలికికన్నుల నున్నకాటుకరేకలు నీ
పలచనికెమ్మోవి పాఁగి వున్నవి
అలరి శ్రీవేంకటేశ ఆసె నన్నుఁ గూడితివి
చలివాయ నీపెదవి చాఁచి చూచుకోవయ్యా
(||pallavi||)
kaḍavāru sĕppidenu kaḍuvĕṁgĕmai vuṁḍu
aḍari nī sedulane aṁṭi sūsugovayyā
(||kaḍa||)
vanidasĕvula nunna vajrāla kammalavŏttu -
lŏnara nīsĕkkulabai nunnavi neḍu
munugŏnnavalabula mudralavĕ nunnavi
tanara ku nive yaddamu sūsugovayyā
(||kaḍa||)
kāṁtanuduḍa nunnagastūri vaṭruna bŏṭṭu
aṁtalone nīnŏsala naṁṭivunnadi
sĕṁta nīradigi nīlachchĕna gurudaivunadi
viṁtagā gora gīri vīve sūsugovayyā
(||kaḍa||)
kaligigannula nunnagāḍugaregalu nī
palasanigĕmmovi pām̐gi vunnavi
alari śhrīveṁkaḍeśha āsĕ nannum̐ gūḍidivi
salivāya nībĕdavi sām̐si sūsugovayyā