Kadavaaru navvedi kaanavu gaaga

కడవారు నవ్వేది కానవు గాక
Language

(॥పల్లవి॥)
కడవారు నవ్వేది కానవు గాక
గొడవల మమ్ముఁ జూచి గుద్దిరము లేఁటికే

(॥కడవారు॥)
నిండుఁ బరితాపమున నీ వేల సొలసేవు
అండనె నాతో నవ్వే వాతనిఁ జూచి
చండి పెట్టి మగవాని సాదించి వలవు మంటా
బండు సేసే యాఁటదాని బదు కేఁటి బదుకే

(॥కడవారు॥)
నిక్కి చూచే యాతిని నీ వేల కోపగించేవే
మక్కువ నతఁడు నాతో మాఁట లాడఁగా
వొక్కతెపై తరితీ పై వుండెటివిభునిఁ జూచి
గుక్కిళ్లు మింగేదానిగుణ మేఁటి గుణమే

(॥కలవారు॥)
బలిమి శ్రీవెంకటేశుఁ బగ లేల చాటేవే
కలసి యాతఁడు నన్నుఁ గాగిలించఁగా
పిలువని పేరటము ప్రియునివద్దకి వచ్చి
చలముకొనేటిదాని చల మేఁటి చలమే

(||pallavi||)
kaḍavāru navvedi kānavu gāga
gŏḍavala mammum̐ jūsi guddiramu lem̐ṭige

(||kaḍavāru||)
niṁḍum̐ baridābamuna nī vela sŏlasevu
aṁḍanĕ nādo navve vādanim̐ jūsi
saṁḍi pĕṭṭi magavāni sādiṁchi valavu maṁṭā
baṁḍu sese yām̐ṭadāni badu kem̐ṭi baduge

(||kaḍavāru||)
nikki sūse yādini nī vela kobagiṁcheve
makkuva nadam̐ḍu nādo mām̐ṭa lāḍam̐gā
vŏkkadĕbai taridī pai vuṁḍĕḍivibhunim̐ jūsi
gukkiḽlu miṁgedāniguṇa mem̐ṭi guṇame

(||kalavāru||)
balimi śhrīvĕṁkaḍeśhum̐ baga lela sāḍeve
kalasi yādam̐ḍu nannum̐ gāgiliṁcham̐gā
piluvani peraḍamu priyunivaddagi vachchi
salamugŏneḍidāni sala mem̐ṭi salame