Kadavaari nee maa tadugave neevu

కడవారి నీ మా టడుగవే నీవు
Language

(॥పల్లవి॥)
కడవారి నీ మా టడుగవే నీవు
వెడగు నీ గుణములు విచారించుకొనవే

(॥కడవారి॥)
నీసవతి నైతిఁ గాక నిన్ను నే మైనా నంటినా
వాసు లెక్కించుక వట్టివా దేలే నీకు
ఆల నిద్దరికిని ఆతఁడే గురుతు గాక
రేసులు వుట్టించి యాల రేఁచేవే మమ్మును

(॥కడవారి॥)
తప్పక చూచితిఁ గాక తడవితినా నిన్ను
వుప్పటించి యంతేసి మ మ్మొరనేవే
తప్పులుఁ దారులు వాప తగ వాతఁడే యెఱఁగు
చప్ప నాయ మానవే నీట లెల్ల నిఁకయ

(॥కడవారి॥)
తెలిసితి నన్నియు నీ తెరువు వచ్చితనా
చలము లిక్కడ నింక సాదించకువే
అలరి శ్రీవెంకటేశుఁ డన్నిటాను నన్నుఁ గూడె
పెలుచవు నిన్నెఱుఁగు పెనఁగ నేమిటికే

(||pallavi||)
kaḍavāri nī mā ṭaḍugave nīvu
vĕḍagu nī guṇamulu visāriṁchugŏnave

(||kaḍavāri||)
nīsavadi naidim̐ gāga ninnu ne mainā naṁṭinā
vāsu lĕkkiṁchuga vaṭṭivā dele nīgu
āla niddarigini ādam̐ḍe gurudu gāga
resulu vuṭṭiṁchi yāla rem̐seve mammunu

(||kaḍavāri||)
tappaga sūsidim̐ gāga taḍavidinā ninnu
vuppaḍiṁchi yaṁtesi ma mmŏraneve
tappulum̐ dārulu vāba taga vādam̐ḍe yĕṟam̐gu
sappa nāya mānave nīḍa lĕlla nim̐kaya

(||kaḍavāri||)
tĕlisidi nanniyu nī tĕruvu vachchidanā
salamu likkaḍa niṁka sādiṁchaguve
alari śhrīvĕṁkaḍeśhum̐ ḍanniḍānu nannum̐ gūḍĕ
pĕlusavu ninnĕṟum̐gu pĕnam̐ga nemiḍige