Kadamgi yaadamdu neegu gaasugunnaamdu

కడఁగి యాతఁడు నీకు గాచుకున్నాఁడు
Language

(॥పల్లవి॥)
కడఁగి యాతఁడు నీకు గాచుకున్నాఁడు
వుడివోని రతిఁ గూడె వోలలాడఁగదవే

(॥కడ॥)
వెలయ మాటాడవలె విభునితో నవ్వవలె
చలపాదితనమేలే సతులకును
తలవంచుకొననేల తప్పులు వెదకనేల
పిలిచీ నాతఁడు నిన్నుఁ బ్రియముచేకొనవే

(॥కడ॥)
అంకెలో మెలఁగవలె ఆయము లంటఁగవలె
మంకుదన మింతయేలే మగువలకు
జంకెనలు చూపనేల సడిఁ బెట్ట నంతయేల
పొంకాన నెదురుచూచీ పొత్తు కిట్టె రావే

(॥కడ॥)
గుట్టున నుండఁగవలె కూరిమిఁ బెనఁగవలె
వట్టి బింకా లివియేలే వనితలకు
చిట్టకములేల నిన్ను శ్రీవేంకటేశుఁడు గూడె
గట్టేయ మీయెన్నికలు కాఁగిలించుకొనవే

(||pallavi||)
kaḍam̐gi yādam̐ḍu nīgu gāsugunnām̐ḍu
vuḍivoni radim̐ gūḍĕ volalāḍam̐gadave

(||kaḍa||)
vĕlaya māḍāḍavalĕ vibhunido navvavalĕ
salabādidanamele sadulagunu
talavaṁchugŏnanela tappulu vĕdaganela
pilisī nādam̐ḍu ninnum̐ briyamusegŏnave

(||kaḍa||)
aṁkĕlo mĕlam̐gavalĕ āyamu laṁṭam̐gavalĕ
maṁkudana miṁtayele maguvalagu
jaṁkĕnalu sūbanela saḍim̐ bĕṭṭa naṁtayela
pŏṁkāna nĕdurusūsī pŏttu kiṭṭĕ rāve

(||kaḍa||)
guṭṭuna nuṁḍam̐gavalĕ kūrimim̐ bĕnam̐gavalĕ
vaṭṭi biṁkā liviyele vanidalagu
siṭṭagamulela ninnu śhrīveṁkaḍeśhum̐ḍu gūḍĕ
gaṭṭeya mīyĕnnigalu kām̐giliṁchugŏnave