(॥పల్లవి॥)
కడమమాటలు నీవే కనుకోవయ్యా
పడతులలోన వాసిపట్టుదాననయ్యా
(॥కడ॥)
పంతము నేనా విడువ పైకొని మాటలాడేవు
యెంతవడి వూఁకొందు నేమనేవయ్యా
కాంతుడవు నీవు గక్కన వంచుకోరాదు
చెంత నీనవ్వుల కెట్టు చేతులొగ్గేనయ్యా
(॥కడ॥)
పాయపుగర్వపుదానఁ బలుమారు మొక్కేవు
యీయెడ నెందాఁకాఁ జూతు నేమనేవయ్యా
నీయంత దొరవు పని నీచేఁ గొనఁగరాదు
చాయల నేమని నీతో సమ్మతించేనయ్యా
(॥కడ॥)
చలము నాకే కలదు సారె నన్ను వేఁడుకొనే-
యెలయింపు లెట్టువిందు నేమనేనయ్యా
బలిమి శ్రీవేంకటేశ పైకొని కూడితి విట్టె
నిలువెల్లా వలుపులే నీవే నేనయ్యా
(||pallavi||)
kaḍamamāḍalu nīve kanugovayyā
paḍadulalona vāsibaṭṭudānanayyā
(||kaḍa||)
paṁtamu nenā viḍuva paigŏni māḍalāḍevu
yĕṁtavaḍi vūm̐kŏṁdu nemanevayyā
kāṁtuḍavu nīvu gakkana vaṁchugorādu
sĕṁta nīnavvula kĕṭṭu sedulŏggenayyā
(||kaḍa||)
pāyabugarvabudānam̐ balumāru mŏkkevu
yīyĕḍa nĕṁdām̐kām̐ jūdu nemanevayyā
nīyaṁta dŏravu pani nīsem̐ gŏnam̐garādu
sāyala nemani nīdo sammadiṁchenayyā
(||kaḍa||)
salamu nāge kaladu sārĕ nannu vem̐ḍugŏne-
yĕlayiṁpu lĕṭṭuviṁdu nemanenayyā
balimi śhrīveṁkaḍeśha paigŏni kūḍidi viṭṭĕ
niluvĕllā valubule nīve nenayyā