Kadamale demidaanu ghanumdavayyaa

కడమలే దేమిటాను ఘనుఁడవయ్యా
Language

(॥పల్లవి॥)
కడమలే దేమిటాను ఘనుఁడవయ్యా
కడుపులోనే నేర్పితి కంటిమయ్యా

(॥కడ॥)
సిగ్గువడ్డఆపెనే చీరవట్టి తీసేవు
అగ్గలమైతి వన్నిటా నౌనయ్యా
వొగ్గి నవ్వేయాపెనే వూరకే గిలిగించేవు
తగ్గులేనిజాణఁడవు తగునయ్యా

(॥కడ॥)
మొక్కేటియా సెపైనే మోపేపు నీపాదములు
మిక్కిలి నేరుపరవి మేలయ్యా
అక్కరపడేయాపెకే ఆసలు మరి రేఁచేవు
యెక్కువగుణాలు నీయం దెఱిఁగితిమయ్యా

(॥కడ॥)
కూడేటియాపెనే కుచ్చి కాఁగిలించేవు
వోడనేమిటికి నీవు వొప్పితిమయ్య
పాడితో శ్రీవేంకటేశ పైకొని యాపెఁ బైకొంటి
వేడనైనా నీవే దొర నియ్యకొంటిమయ్యా

(||pallavi||)
kaḍamale demiḍānu ghanum̐ḍavayyā
kaḍubulone nerbidi kaṁṭimayyā

(||kaḍa||)
sigguvaḍḍaābĕne sīravaṭṭi tīsevu
aggalamaidi vanniḍā naunayyā
vŏggi navveyābĕne vūrage giligiṁchevu
taggulenijāṇam̐ḍavu tagunayyā

(||kaḍa||)
mŏkkeḍiyā sĕbaine mobebu nībādamulu
mikkili nerubaravi melayyā
akkarabaḍeyābĕge āsalu mari rem̐sevu
yĕkkuvaguṇālu nīyaṁ dĕṟim̐gidimayyā

(||kaḍa||)
kūḍeḍiyābĕne kuchchi kām̐giliṁchevu
voḍanemiḍigi nīvu vŏppidimayya
pāḍido śhrīveṁkaḍeśha paigŏni yābĕm̐ baigŏṁṭi
veḍanainā nīve dŏra niyyagŏṁṭimayyā