కడమ లున్నవా యింకఁ గైకొన్నదాన
(॥పల్లవి॥)
కడమ లున్నవా యింకఁ గైకొన్నదాన
యెడయని దొరవు నీయిచ్చ యింతేకాక
(॥కడ॥)
వాసులెంచవలెనా వలచినదాన నేను
సేసినటెల్లా నీకుఁ జెల్లెఁగాక
వేసరఁగఁ దగునా నీ వేలువట్టినట్టిదాన
రాసికెక్కినట్టి నీరపమాయఁ గాక
(॥కడ॥)
వోపనవలెనా వూడిగపుదాన నేను
చేపట్టినట్టెల్లా నీకె చెల్లెఁగాక
కోపగించఁ దగునా కొలువు సేసేటిదాన
దాపుగ నీవాడినపంతము దక్కెఁగాక
(॥కడ॥)
గోర గీరవలెనా కూడినట్టిదాన నేను
చీరకొంగంటినదెల్లాఁ జెల్లెఁగాక
ధీరుఁడ శ్రీవేంకటేశ తిట్టఁదగునా నీదాన
నేరిచిన నీనేరుపు నెరవేరెఁగాక
(||pallavi||)
kaḍama lunnavā yiṁkam̐ gaigŏnnadāna
yĕḍayani dŏravu nīyichcha yiṁtegāga
(||kaḍa||)
vāsulĕṁchavalĕnā valasinadāna nenu
sesinaḍĕllā nīgum̐ jĕllĕm̐gāga
vesaram̐gam̐ dagunā nī veluvaṭṭinaṭṭidāna
rāsigĕkkinaṭṭi nīrabamāyam̐ gāga
(||kaḍa||)
vobanavalĕnā vūḍigabudāna nenu
sebaṭṭinaṭṭĕllā nīgĕ sĕllĕm̐gāga
kobagiṁcham̐ dagunā kŏluvu seseḍidāna
dābuga nīvāḍinabaṁtamu dakkĕm̐gāga
(||kaḍa||)
gora gīravalĕnā kūḍinaṭṭidāna nenu
sīragŏṁgaṁṭinadĕllām̐ jĕllĕm̐gāga
dhīrum̐ḍa śhrīveṁkaḍeśha tiṭṭam̐dagunā nīdāna
nerisina nīnerubu nĕraverĕm̐gāga