(॥పల్లవి॥)
కతలు సేయక నన్నుఁ గావరాదా
గతి నీవే నన్ను నీవు కావరాదా
(॥కత॥)
అమ్మఁ గారి విన్నపము లయినాను విని నీవు
కమ్ముక నన్ను నిట్టెకావరాదా
యెమ్మెల నీకరుణ యెంచుక నేఁడయినాను
కమ్మరఁ గమ్మర నిట్టె కావరాదా
(॥కత॥)
అంతరియామివై నఆమొగ దాకిరికైనా
కంతుగురుఁడ నన్నుఁ గావరాదా
వంతులకు నన్ను నీవు వలపించు కొంటివి
కాంత నని యిందు కైనాఁ గావరాదా
(॥కత॥)
లోకము లిన్నియు నేలి లోకుల రక్షింతువు
కైకొని యీమాఁటకైనాఁ గావరాదా
శ్రీకాంతుఁడవు నీవు శ్రీవేంకటేశ్వరుఁడవు
కాకు సేయ కిఁకనయినాఁ గావరాదా
(||pallavi||)
kadalu seyaga nannum̐ gāvarādā
gadi nīve nannu nīvu kāvarādā
(||kada||)
ammam̐ gāri vinnabamu layinānu vini nīvu
kammuga nannu niṭṭĕgāvarādā
yĕmmĕla nīgaruṇa yĕṁchuga nem̐ḍayinānu
kammaram̐ gammara niṭṭĕ kāvarādā
(||kada||)
aṁtariyāmivai naāmŏga dāgirigainā
kaṁtugurum̐ḍa nannum̐ gāvarādā
vaṁtulagu nannu nīvu valabiṁchu kŏṁṭivi
kāṁta nani yiṁdu kainām̐ gāvarādā
(||kada||)
logamu linniyu neli logula rakṣhiṁtuvu
kaigŏni yīmām̐ṭagainām̐ gāvarādā
śhrīgāṁtum̐ḍavu nīvu śhrīveṁkaḍeśhvarum̐ḍavu
kāgu seya kim̐kanayinām̐ gāvarādā