Kadalenigeeridi gattugomtivi

కడలేనికీరితి గట్టుకొంటివి
Language

(॥పల్లవి॥)
కడలేనికీరితి గట్టుకొంటివి
చిడుముడి నింకా సంతోసించేము నిన్నును

(॥॥)
బలిమికాఁడ వౌదువు పంతమెల్లా నీకుఁ జెల్లె
చలము లింతులనే సాదించితివి
చెలియ భావము నీవు చిత్తగించి మన్నించు
పొలుపుమిగుల నేము పొగడేము నిన్నును

(॥॥)
నేరుపరి వౌదువు నేమాన నడచితివి
యీరీతిఁ గాంతల గెల్చి యీడేరితివి
సారెకు నీవనితకు చనవిచ్చి దయఁ జూడు
మేరమీర బ త్తిసేసి మెచ్చేము నిన్నును

(॥॥)
తగవరి వౌదువు తప్పు దేరుచుకొంటివి
తగలి చొక్కించితివి తరుణులను
నగుతా శ్రీ వేంకటేశ నలినాక్షిఁ గూడితివి
జగములో జాణవని చాటేము నిన్నును

(||pallavi||)
kaḍalenigīridi gaṭṭugŏṁṭivi
siḍumuḍi niṁkā saṁtosiṁchemu ninnunu

(||||)
balimigām̐ḍa vauduvu paṁtamĕllā nīgum̐ jĕllĕ
salamu liṁtulane sādiṁchidivi
sĕliya bhāvamu nīvu sittagiṁchi manniṁchu
pŏlubumigula nemu pŏgaḍemu ninnunu

(||||)
nerubari vauduvu nemāna naḍasidivi
yīrīdim̐ gāṁtala gĕlsi yīḍeridivi
sārĕgu nīvanidagu sanavichchi dayam̐ jūḍu
meramīra ba ttisesi mĕchchemu ninnunu

(||||)
tagavari vauduvu tappu derusugŏṁṭivi
tagali sŏkkiṁchidivi taruṇulanu
nagudā śhrī veṁkaḍeśha nalinākṣhim̐ gūḍidivi
jagamulo jāṇavani sāḍemu ninnunu