Kadaleni valabula kadalaamdi

కడలేని వలపుల కతలాఁడి
Language

(॥పల్లవి॥)
కడలేని వలపుల కతలాఁడి
పెడరేఁచీఁ దమకము ప్రియమా వోయీ

(॥కడ॥)
సన్నలనే మోవితేనెచవులు నీకుఁజూపి
చన్నులమీఁదిపయ్యద జారించీ
కన్నులనే మాటలాడి కళలు నీకు రేఁచి
యెన్నిచేఁతలు సేసిని యింతి నీ యెదుటను

(॥కడ॥)
సెలవుల కొంతకొంత చిరునవ్వులు నవ్వి
తొలఁకుఁగళల మోము తోఁగి చూచీని
వులి వచ్చిసిగ్గులతో నొయ్యనె కొలువు సేసి
యెలయించీ నిన్ను నిది యేమందు నేను

(॥కడు॥)
అంగపుసోఁకులనే ఆయాలు నీకు రేఁచి
వుంగరాలచేతఁబాదా లొత్తి యొత్తీ
చెంగిట న న్నేలితివి శ్రీవేంకటేశుఁడ తాను
అంగవించి సేసివెట్టీ నప్పుడే నీమీఁదను

(||pallavi||)
kaḍaleni valabula kadalām̐ḍi
pĕḍarem̐sīm̐ damagamu priyamā voyī

(||kaḍa||)
sannalane movidenĕsavulu nīgum̐jūbi
sannulamīm̐dibayyada jāriṁchī
kannulane māḍalāḍi kaḽalu nīgu rem̐si
yĕnnisem̐talu sesini yiṁti nī yĕduḍanu

(||kaḍa||)
sĕlavula kŏṁtagŏṁta sirunavvulu navvi
tŏlam̐kum̐gaḽala momu tom̐gi sūsīni
vuli vachchisiggulado nŏyyanĕ kŏluvu sesi
yĕlayiṁchī ninnu nidi yemaṁdu nenu

(||kaḍu||)
aṁgabusom̐kulane āyālu nīgu rem̐si
vuṁgarālasedam̐bādā lŏtti yŏttī
sĕṁgiḍa na nnelidivi śhrīveṁkaḍeśhum̐ḍa tānu
aṁgaviṁchi sesivĕṭṭī nappuḍe nīmīm̐danu