Kadaleni paraagulu galavaamdavu

కడలేని పరాకులు గలవాఁడవు
Language

(॥పల్లవి॥)
కడలేని పరాకులు గలవాఁడవు
జడియ కెప్పుడును మా చనవు చేకొనుమీ

(॥కడ॥)
చేపట్టి యెప్పుడును చిత్తాన మఱవకుమీ
ఆపె నీకు నాచేఁ జెప్పియంపినమాట
చూపట్టివున్నది శిరసున ముడుచుకొనుమీ
మాపటంత వేసినకమ్మనితమ్మిపూవు

(॥కడ॥)
చెలరేఁగి నీయరచేతనే పట్టుకుండుమీ
నిలిచి కానుకిచ్చిననిమ్మపండు
పలుమారు కన్నులను భావించి చూడుమీ
వలనుగా సురటిపైవాసినచెలిరూపు

(॥కడ॥)
చక్కఁగా తరితీపుతో చవిసేసుకొనుమీ
మొక్కుతాం జూపినయట్టిమోవిపండు
అక్కున శ్రీవేంకటేశ అలమేలుమంగ గూడె
తక్కక యేపొద్దును దయ నేలుకొనుమీ

(||pallavi||)
kaḍaleni parāgulu galavām̐ḍavu
jaḍiya kĕppuḍunu mā sanavu segŏnumī

(||kaḍa||)
sebaṭṭi yĕppuḍunu sittāna maṟavagumī
ābĕ nīgu nāsem̐ jĕppiyaṁpinamāḍa
sūbaṭṭivunnadi śhirasuna muḍusugŏnumī
mābaḍaṁta vesinagammanidammibūvu

(||kaḍa||)
sĕlarem̐gi nīyarasedane paṭṭuguṁḍumī
nilisi kānugichchinanimmabaṁḍu
palumāru kannulanu bhāviṁchi sūḍumī
valanugā suraḍibaivāsinasĕlirūbu

(||kaḍa||)
sakkam̐gā taridībudo savisesugŏnumī
mŏkkudāṁ jūbinayaṭṭimovibaṁḍu
akkuna śhrīveṁkaḍeśha alamelumaṁga gūḍĕ
takkaga yebŏddunu daya nelugŏnumī