కడలేని గుణముల ఘనుఁ డాతఁడు
(॥పల్లవి॥)
కడలేని గుణముల ఘనుఁ డాతఁడు
వెడవెడగా నేఁటికి వెరగువడేవే
(॥కడ॥)
గాఁటముతో నాతఁడు గారవించి పిలువఁగ
చీటికిమాటికినేల సిగ్గువడేవే
చోటిచ్చి యాతఁడు నీతో చుట్టరికము చెప్పఁగ
జూటవై మనసులేల సొదించేవే
(॥కడ॥)
పెద్దరికములు సేసి పెనఁగఁగ నాతని-
వద్దనుండి శిరసేల వంచేవే
సుద్దులు నిన్నడుగుతా సోగకన్నులఁ జూడఁగ
కొద్దెఱిఁగియునునేల గుట్టుసేసేవే
(॥కడ॥)
కైవశమై యాతఁడు కాఁగిలించి నిన్నుఁ గూడె
వేవేగ మొక్కుచు నెంత వేఁడుకొనేవే
నీవలమేలుమంగవు శ్రీవేంకటేశుఁడు తాను
యీవేళ నిన్ను మన్నించెయెత కోసరేవే
(||pallavi||)
kaḍaleni guṇamula ghanum̐ ḍādam̐ḍu
vĕḍavĕḍagā nem̐ṭigi vĕraguvaḍeve
(||kaḍa||)
gām̐ṭamudo nādam̐ḍu gāraviṁchi piluvam̐ga
sīḍigimāḍiginela sigguvaḍeve
soḍichchi yādam̐ḍu nīdo suṭṭarigamu sĕppam̐ga
jūḍavai manasulela sŏdiṁcheve
(||kaḍa||)
pĕddarigamulu sesi pĕnam̐gam̐ga nādani-
vaddanuṁḍi śhirasela vaṁcheve
suddulu ninnaḍugudā sogagannulam̐ jūḍam̐ga
kŏddĕṟim̐giyununela guṭṭuseseve
(||kaḍa||)
kaivaśhamai yādam̐ḍu kām̐giliṁchi ninnum̐ gūḍĕ
vevega mŏkkusu nĕṁta vem̐ḍugŏneve
nīvalamelumaṁgavu śhrīveṁkaḍeśhum̐ḍu tānu
yīveḽa ninnu manniṁchĕyĕda kosareve