Kadalela seppevu kadu nijamarinamtaa

కతలేల చెప్పేవు కడు నిజమరినంటా
Language

(॥పల్లవి॥)
కతలేల చెప్పేవు కడు నిజమరినంటా
పతివి నీచేఁతలెల్లాఁ బచారించవలెనా

(॥కత॥)
చూచితేనే తెలియదా చొక్కమైన మోహము
చేచేత నంతేసి గరిసించవలెనా
కాచుక వేగించేయందే కానదారా నీసుద్దులు
యీచాయ నింద నీపైనింకా మోపవలెనా

(॥కత॥)
మాటాడితేఁ దెలియదా మనసులోపలిచింత
గాఁటాన వేరే నిన్నడుగఁగవలెనా
తేటగా నూరకే నవ్వితేనే కానరాదా కీలు
పాటించి నేరమి నీపై వేయవలేనా

(॥కత॥)
నిలిచితేఁ దెలియదా నీలోనివుద్యోగము
చెలరేఁగి నిన్ను రట్టుసేయవలెనా
అలమేలుమంగను నేను అట్టె శ్రీవేంకటేశ
కలసితివి నన్ను నీగతు లెంచవలెనా

(||pallavi||)
kadalela sĕppevu kaḍu nijamarinaṁṭā
padivi nīsem̐talĕllām̐ basāriṁchavalĕnā

(||kada||)
sūsidene tĕliyadā sŏkkamaina mohamu
seseda naṁtesi garisiṁchavalĕnā
kāsuga vegiṁcheyaṁde kānadārā nīsuddulu
yīsāya niṁda nībainiṁkā mobavalĕnā

(||kada||)
māḍāḍidem̐ dĕliyadā manasulobalisiṁta
gām̐ṭāna vere ninnaḍugam̐gavalĕnā
teḍagā nūrage navvidene kānarādā kīlu
pāḍiṁchi nerami nībai veyavalenā

(||kada||)
nilisidem̐ dĕliyadā nīlonivudyogamu
sĕlarem̐gi ninnu raṭṭuseyavalĕnā
alamelumaṁganu nenu aṭṭĕ śhrīveṁkaḍeśha
kalasidivi nannu nīgadu lĕṁchavalĕnā