Kadagadaa yidi yeme kadadaanavaa

కటకటా యిది యేమే కడదానవా
Language

(॥పల్లవి॥)
కటకటా యిది యేమే కడదానవా
ఘటనల నీకేల కడుగోలతనము

(॥కట॥)
తప్పక చూచినచూపు దగ్గరి వచ్చినరాక
యిప్పుడే యెఱిఁగించవే యింతి నాతోను
అప్పుడే సిగ్గువడితి వాయము సోఁకితే నిఁక
చెప్పినేల నీలోని చిడుముడి తనము

(॥కట॥)
పుక్కిటపూచినమాట పొందఁ గూచున్నవునికి
తక్కక సూచించఁగదే తరుణిరో
చిక్కి యిందుకే లోఁగి చెయిఁజేయి గదిసితే
యెక్కడిదే ధైర్యము యెంత సాదుఁదనము

(॥కట॥)
కందువఁ జూపినసన్న కాఁగిటఁ బట్టినపట్టు
మందలించఁగదే యిఁక మగువరో
విందువలెఁ గూడితి శ్రీవేంకటేశుఁ డను నన్ను
దిందుపడె నీకు నిట్టె తేరి జాణతనము

(||pallavi||)
kaḍagaḍā yidi yeme kaḍadānavā
ghaḍanala nīgela kaḍugoladanamu

(||kaḍa||)
tappaga sūsinasūbu daggari vachchinarāga
yippuḍe yĕṟim̐giṁchave yiṁti nādonu
appuḍe sigguvaḍidi vāyamu som̐kide nim̐ka
sĕppinela nīloni siḍumuḍi tanamu

(||kaḍa||)
pukkiḍabūsinamāḍa pŏṁdam̐ gūsunnavunigi
takkaga sūsiṁcham̐gade taruṇiro
sikki yiṁduge lom̐gi sĕyim̐jeyi gadiside
yĕkkaḍide dhairyamu yĕṁta sādum̐danamu

(||kaḍa||)
kaṁduvam̐ jūbinasanna kām̐giḍam̐ baṭṭinabaṭṭu
maṁdaliṁcham̐gade yim̐ka maguvaro
viṁduvalĕm̐ gūḍidi śhrīveṁkaḍeśhum̐ ḍanu nannu
diṁdubaḍĕ nīgu niṭṭĕ teri jāṇadanamu