కటకటా యీ యాత్మ లేగతి నీడేరఁ గలరు
(॥పల్లవి॥)
కటకటా యీ యాత్మ లేగతి నీడేరఁ గలరు
యిటు నీకు శరణంటే యిట్టే రక్షింతువు
(॥కటకటా॥)
చేరి నీ మహిమ చిరజీవుల నడిగే మంటే
ఆ రీతి జీవులు బ్రహ్మాదిదేవత లింతే
వారఁ దమపుట్టిన యవ్వలగాని తొల్లింటి
నీ రూప మింతింతని నిశ్చయింప లేరు
(॥కటకటా॥)
అందరికి శ్రుతులే ఆధార మనాదినుండి
పొందుగా నడిగే మంటే పొడచూప వదియును
కందువ ఋషులపాఠక్రమముల వచ్చె నింతే
అందరియర్థములు నిశ్చయము సేయ లేరు
(॥కటకటా॥)
అదిగాన యెంచి సనకాదులు శుకాదులును
మొదలనే నినుఁ గొల్చి ముక్తు లనిపించుకొనిరి
అదనఁ దక్కిన వుపాయముల నింత వున్నదా
పదిల మలమేల్మంగపతి శ్రీవేంకటేశా
(||pallavi||)
kaḍagaḍā yī yātma legadi nīḍeram̐ galaru
yiḍu nīgu śharaṇaṁṭe yiṭṭe rakṣhiṁtuvu
(||kaḍagaḍā||)
seri nī mahima sirajīvula naḍige maṁṭe
ā rīdi jīvulu brahmādidevada liṁte
vāram̐ damabuṭṭina yavvalagāni tŏlliṁṭi
nī rūba miṁtiṁtani niśhchayiṁpa leru
(||kaḍagaḍā||)
aṁdarigi śhrudule ādhāra manādinuṁḍi
pŏṁdugā naḍige maṁṭe pŏḍasūba vadiyunu
kaṁduva ṛṣhulabāṭhakramamula vachchĕ niṁte
aṁdariyardhamulu niśhchayamu seya leru
(||kaḍagaḍā||)
adigāna yĕṁchi sanagādulu śhugādulunu
mŏdalane ninum̐ gŏlsi muktu lanibiṁchugŏniri
adanam̐ dakkina vubāyamula niṁta vunnadā
padila malamelmaṁgabadi śhrīveṁkaḍeśhā