Kadagadaa yeduvamti kattidi sittamo kaaga

కటకటా యెటువంటి కట్టిడి చిత్తమో కాక
Language

(॥పల్లవి॥)
కటకటా యెటువంటి కట్టిడి చిత్తమో కాక
యెటువలెఁ గరఁగదు యెంత రాయో కాక

(॥కట॥)
మన సిచ్చి మాతోడ మాటలాడ వద్దు గాక
ననిచి సెలవినైనా నవ్వరాదా
వనితరో నీవు నేను వాదు లడిచి నప్పుడే
పొనిగి యింతేసి సేయ బోయ పగా మనకు

(॥కట॥)
సమ్మతించి నామోము చక్కఁ జూడ వద్దు గాక
వుమ్మడి నాకతలకు వూఁకొన వద్దా
పమ్మి మన మిద్దరము పంతము లాడుకొంటేనే
కమ్మర నింత చలము కట్టు గుత్తా మనకు

(॥కట॥)
పెట్టిన దండ దియ్యక పేరుకొనవద్దు గాక
గుట్టునఁ గౌఁగిట నించి కూడవద్దా
అట్టే శ్రీవేంకటేశ అలమేలుమంగ నేను
జట్టిగాఁ గలసితిమి సట లేల మనకు

(||pallavi||)
kaḍagaḍā yĕḍuvaṁṭi kaṭṭiḍi sittamo kāga
yĕḍuvalĕm̐ garam̐gadu yĕṁta rāyo kāga

(||kaḍa||)
mana sichchi mādoḍa māḍalāḍa vaddu gāga
nanisi sĕlavinainā navvarādā
vanidaro nīvu nenu vādu laḍisi nappuḍe
pŏnigi yiṁtesi seya boya pagā managu

(||kaḍa||)
sammadiṁchi nāmomu sakkam̐ jūḍa vaddu gāga
vummaḍi nāgadalagu vūm̐kŏna vaddā
pammi mana middaramu paṁtamu lāḍugŏṁṭene
kammara niṁta salamu kaṭṭu guttā managu

(||kaḍa||)
pĕṭṭina daṁḍa diyyaga perugŏnavaddu gāga
guṭṭunam̐ gaum̐giḍa niṁchi kūḍavaddā
aṭṭe śhrīveṁkaḍeśha alamelumaṁga nenu
jaṭṭigām̐ galasidimi saḍa lela managu