Kadagadaa meemdadettu kaanadaaya nevvaderaa

కటకటా మీఁదటెత్తు కానదాయ నెవ్వతెరా
Language

(॥పల్లవి॥)
కటకటా మీఁదటెత్తు కానదాయ నెవ్వతెరా
కుటిలపుఁ బులకలు కుప్పవడీ మేనను

(॥॥)
కడు నీమోవిచిగురు గంటిసేసె నెవ్వతెరా
వడిసీఁ దేనెలు అందువంక నింతాను
పొడమించె చెమటలు పొలిఁతి యెవ్వతెరా
కడలేనినీమనసు కరఁగు నందునను

(॥॥)
రేసుల నిట్టూరుపులు రేఁచిన దెవ్వతెరా
గాసిగా నీవలపులు గాలిఁబోయీని
తోసి నీకన్నుల నిద్ర తొట్టించిన దెవ్వతెరా
వోసరిలి తమకము లుమ్మగిలీ నందును

(॥॥)
గందపు గుబ్బలముద్ర కడునొత్తె నెవ్వతెరా
అందువల్ల సిగ్గు నీకు నచ్చుపడెను
కందువ శ్రీ వేంకటేశ కలసితి విటు నన్ను
నిందవాసె నిందువంక నేఁ డెందున్నదిరా

(||pallavi||)
kaḍagaḍā mīm̐daḍĕttu kānadāya nĕvvadĕrā
kuḍilabum̐ bulagalu kuppavaḍī menanu

(||||)
kaḍu nīmovisiguru gaṁṭisesĕ nĕvvadĕrā
vaḍisīm̐ denĕlu aṁduvaṁka niṁtānu
pŏḍamiṁchĕ sĕmaḍalu pŏlim̐ti yĕvvadĕrā
kaḍaleninīmanasu karam̐gu naṁdunanu

(||||)
resula niṭṭūrubulu rem̐sina dĕvvadĕrā
gāsigā nīvalabulu gālim̐boyīni
tosi nīgannula nidra tŏṭṭiṁchina dĕvvadĕrā
vosarili tamagamu lummagilī naṁdunu

(||||)
gaṁdabu gubbalamudra kaḍunŏttĕ nĕvvadĕrā
aṁduvalla siggu nīgu nachchubaḍĕnu
kaṁduva śhrī veṁkaḍeśha kalasidi viḍu nannu
niṁdavāsĕ niṁduvaṁka nem̐ ḍĕṁdunnadirā