Kadagadaa karmamaa kaalamulo marmamaa

కటకటా కర్మమా కాలములో మర్మమా
Language

(॥పల్లవి॥)
కటకటా కర్మమా కాలములో మర్మమా
మటమాయైపోతివంటా మది నమ్మివుంటిఁగా

(॥కట॥)
పాపబుద్ధి యాడనుండె పాయము రానినాఁడు
కోప మేడనుండె గర్భగోళమున నున్ననాఁడు
దీపన మేడనుండె దేహధారి గానినాఁడు
యేపున భూమిఁ బుట్టితే నేడనుండి వచ్చెనో

(॥కట॥)
నగుసంసార మెందుండె నరకాన నుండునాఁడు
తగిలి మరణదెస ధనవాంఛ లెందుండె
వొగి లోభ మేడనుండె వొంటినున్నవాఁడు
వెగటై నేఁడెట్టు నన్ను వెదకి పైకొనెనో

(॥కట॥)
బహుబంధా లేడనుండె ప్రళయకాలమునాఁడు
మహిఁ గోరికెలెందుండె మతి మఱచిననాఁడు
యిహమున శ్రీవేంకటేశు శరణంటి నేఁడు
విహితమై మాకు నెట్టు వెఱచెనో తాము

(||pallavi||)
kaḍagaḍā karmamā kālamulo marmamā
maḍamāyaibodivaṁṭā madi nammivuṁṭim̐gā

(||kaḍa||)
pābabuddhi yāḍanuṁḍĕ pāyamu rāninām̐ḍu
koba meḍanuṁḍĕ garbhagoḽamuna nunnanām̐ḍu
dībana meḍanuṁḍĕ dehadhāri gāninām̐ḍu
yebuna bhūmim̐ buṭṭide neḍanuṁḍi vachchĕno

(||kaḍa||)
nagusaṁsāra mĕṁduṁḍĕ naragāna nuṁḍunām̐ḍu
tagili maraṇadĕsa dhanavāṁchha lĕṁduṁḍĕ
vŏgi lobha meḍanuṁḍĕ vŏṁṭinunnavām̐ḍu
vĕgaḍai nem̐ḍĕṭṭu nannu vĕdagi paigŏnĕno

(||kaḍa||)
bahubaṁdhā leḍanuṁḍĕ praḽayagālamunām̐ḍu
mahim̐ gorigĕlĕṁduṁḍĕ madi maṟasinanām̐ḍu
yihamuna śhrīveṁkaḍeśhu śharaṇaṁṭi nem̐ḍu
vihidamai māgu nĕṭṭu vĕṟasĕno tāmu