కటకటా జీవుఁడా కాలము దోలుకరాఁగ
(॥పల్లవి॥)
కటకటా జీవుఁడా కాలము దోలుకరాఁగ
సటవటలనే పొద్దు జరపేవుగా
(॥కట॥)
సమత నన్నియును జదివి కడపటను
కుమతివై అందరిఁ గొలిచే వుగా
తమిగొని ప్రేమ నెంతయును గంగకుఁబోయి
తమకింది నూతినీరు దాగే వుగా
(॥కట॥)
తనువుఁ బ్రాయము నమ్మి దానధర్మము మాని
చెనటివై కర్మాలు సేసే వుగా
వొనరఁగ మీఁదనొడ్డిన మొగులు నమ్మి
దొనలనీళ్ళు వెళ్ళఁదోసే వుగా
(॥కట॥)
యెలమితోఁ దిరువేంకటేశుఁ గొలువలేక
పొలము రాజులవెంటఁ బొయ్యే వుగా
చిలుకకువలె బుద్ధిచెప్పనఁ గానలేక
పలుమారుకే తోజుఁ బాడే వుగా
(||pallavi||)
kaḍagaḍā jīvum̐ḍā kālamu dolugarām̐ga
saḍavaḍalane pŏddu jarabevugā
(||kaḍa||)
samada nanniyunu jadivi kaḍabaḍanu
kumadivai aṁdarim̐ gŏlise vugā
tamigŏni prema nĕṁtayunu gaṁgagum̐boyi
tamagiṁdi nūdinīru dāge vugā
(||kaḍa||)
tanuvum̐ brāyamu nammi dānadharmamu māni
sĕnaḍivai karmālu sese vugā
vŏnaram̐ga mīm̐danŏḍḍina mŏgulu nammi
dŏnalanīḽḽu vĕḽḽam̐dose vugā
(||kaḍa||)
yĕlamidom̐ diruveṁkaḍeśhum̐ gŏluvalega
pŏlamu rājulavĕṁṭam̐ bŏyye vugā
silugaguvalĕ buddhisĕppanam̐ gānalega
palumāruge tojum̐ bāḍe vugā