Kadagada yimkanela kaamka remsevu

కటకట యిఁకనేల కాఁక రేఁచేవు
Language

(॥పల్లవి॥)
కటకట యిఁకనేల కాఁక రేఁచేవు
అటమటములు చాలునప్పటి నా మాటలు

(॥కట॥)
నేరుపు మెరసి వచ్చి నేఁడు నన్నుఁ బిలిచేవు
వూరివారిముందరనే, వోరీ పోరా
యేరా నే నిన్నెరఁగనా యింతబత్తిగలవాఁడ-
వారసి నన్నేల పట్టేవప్పటి నామాఁటలు

(॥కట॥)
తొడిఁబడ నీకెవ్వతే దొరకకుంటే వచ్చి
వొడివట్టి తీసేవు వోరీ పోరా
తడఁబడ నీవల్ల తనిసితిమన్నిటాను
అడియాలమిదే కంటిమప్పటి నామాటలు

(॥కట॥)
ముక్కుతిక్కులకుఁ దెచ్చి మోము చూచినవ్వినాతో
వొక్కటైతివింతలోనే వోరీ పోరా
చక్కని శ్రీవేంకటేశ జాణవవుదువిన్నిటాను
అక్కరదీరఁ గూడితివప్పటి నామాఁటలు

(||pallavi||)
kaḍagaḍa yim̐kanela kām̐ka rem̐sevu
aḍamaḍamulu sālunappaḍi nā māḍalu

(||kaḍa||)
nerubu mĕrasi vachchi nem̐ḍu nannum̐ bilisevu
vūrivārimuṁdarane, vorī porā
yerā ne ninnĕram̐ganā yiṁtabattigalavām̐ḍa-
vārasi nannela paṭṭevappaḍi nāmām̐ṭalu

(||kaḍa||)
tŏḍim̐baḍa nīgĕvvade dŏragaguṁṭe vachchi
vŏḍivaṭṭi tīsevu vorī porā
taḍam̐baḍa nīvalla tanisidimanniḍānu
aḍiyālamide kaṁṭimappaḍi nāmāḍalu

(||kaḍa||)
mukkudikkulagum̐ dĕchchi momu sūsinavvinādo
vŏkkaḍaidiviṁtalone vorī porā
sakkani śhrīveṁkaḍeśha jāṇavavuduvinniḍānu
akkaradīram̐ gūḍidivappaḍi nāmām̐ṭalu