Kadagaari vayidivi kaanee leve nee

కతకారి వయితివి కానీ లేవే నీ
Language

(॥పల్లవి॥)
కతకారి వయితివి కానీ లేవే నీ-
గతులెల్లా రతులయ్యీఁ గానీ లేవే

(॥కత॥)
సన్నసేసి పిలిచితే సారె సారె నాడనుండే
కన్నుల నవ్వేవు అట్టే కానీ లేవే
యెన్ని పూవుల వేసినా నెఱుఁగనట్టే వుండేవు
కన్నెవుగా అందుకేమి కానీ లేవే

(॥కత॥)
జడిగొన మొక్కితేను చనుమొన లిటు చూసి
కడు బీరా లాడేవు కానీ లేవే
వడిఁ గొంగు వట్టితేను వట్టి యాసలే పెట్టి
కడుపేవు కాలము కానీ లేవే

(॥కత॥)
చిప్పిలు వెఱ వడిగితే చెడ్డతిట్టు లెల్లాఁ దిట్టి
కప్పురవీడె మిచ్చేవు కానీ లేవే
యిప్పు డిట్టే శ్రీవేంకటేశుఁ డ నిన్నుఁ గూడితి
కుప్పేవు నీ మోహములు కానీ లేవే

(||pallavi||)
kadagāri vayidivi kānī leve nī-
gadulĕllā radulayyīm̐ gānī leve

(||kada||)
sannasesi piliside sārĕ sārĕ nāḍanuṁḍe
kannula navvevu aṭṭe kānī leve
yĕnni pūvula vesinā nĕṟum̐ganaṭṭe vuṁḍevu
kannĕvugā aṁdugemi kānī leve

(||kada||)
jaḍigŏna mŏkkidenu sanumŏna liḍu sūsi
kaḍu bīrā lāḍevu kānī leve
vaḍim̐ gŏṁgu vaṭṭidenu vaṭṭi yāsale pĕṭṭi
kaḍubevu kālamu kānī leve

(||kada||)
sippilu vĕṟa vaḍigide sĕḍḍadiṭṭu lĕllām̐ diṭṭi
kappuravīḍĕ michchevu kānī leve
yippu ḍiṭṭe śhrīveṁkaḍeśhum̐ ḍa ninnum̐ gūḍidi
kuppevu nī mohamulu kānī leve