కడదాఁకా నీమేలే కాణాచై వున్నది
(॥పల్లవి॥)
కడదాఁకా నీమేలే కాణాచై వున్నది
అడియాలమిఁక వేరే అరయఁ జోటేదిరా
(॥॥)
నించిన కూరిమి నాపై నిజముగ నున్నది
మంచినీగుణాలు నామనసులో నున్నవి
అంచెల నీసరసము లంగముపై నున్నవి
కొంచి కొంచి నిన్నింకఁ గొసరఁ జోటేదిరా
(॥॥)
చెప్పిపంపిన నీరాక చెవులనే వున్నది
రెప్పలెదుట నీరూపు రేపుమాపు నున్నది
చిప్పిలునీమోవితేనె సెలవుల నున్నది
వుప్పితించి నిన్ను నిఁక నొరయఁ జోటేదిరా
(॥॥)
కందువ నీమర్మమెల్లా కాఁగిటిలో నున్నది
అంది నీముద్దుటుంగర మదె నావేల నున్నది
ఇందుకే శ్రీవేంకటేశ ఇటు నన్నుఁ గూడితివి
చిందేటిసిగ్గులు నీపై జిమ్మఁగఁ జోటేదిరా
(||pallavi||)
kaḍadām̐kā nīmele kāṇāsai vunnadi
aḍiyālamim̐ka vere arayam̐ joḍedirā
(||||)
niṁchina kūrimi nābai nijamuga nunnadi
maṁchinīguṇālu nāmanasulo nunnavi
aṁchĕla nīsarasamu laṁgamubai nunnavi
kŏṁchi kŏṁchi ninniṁkam̐ gŏsaram̐ joḍedirā
(||||)
sĕppibaṁpina nīrāga sĕvulane vunnadi
rĕppalĕduḍa nīrūbu rebumābu nunnadi
sippilunīmovidenĕ sĕlavula nunnadi
vuppidiṁchi ninnu nim̐ka nŏrayam̐ joḍedirā
(||||)
kaṁduva nīmarmamĕllā kām̐giḍilo nunnadi
aṁdi nīmudduḍuṁgara madĕ nāvela nunnadi
iṁduge śhrīveṁkaḍeśha iḍu nannum̐ gūḍidivi
siṁdeḍisiggulu nībai jimmam̐gam̐ joḍedirā