Kadabaraayamdu neegu kappuramamdichchee vaamde

కడపరాయఁడు నీకు కప్పురమందిచ్చీ వాఁడె
Language

(॥పల్లవి॥)
కడపరాయఁడు నీకు కప్పురమందిచ్చీ వాఁడె
మడిచియ్యవే ఆకు మనసిచ్చీ నతఁడు

(॥కడ॥)
ప్రియములు చెప్పఁగాను పెనఁగకువే నీవు
నయాగారాలు చూపఁగా నవ్వకువే
నియతాన మొక్కఁగాను నిట్లింత యేఁటికే
క్రియగూడ నియ్యకోవే కేలుచాఁచీ నతఁడు

(॥కడ॥)
చేరి మోమే చూడఁగాను సిగ్గులువడకువే
కూరిమి గొసరఁగానుకోపమేఁటికే
గారవించి పిలువఁగా కాఁతాళించకువే
పేరుకొని పాడఁగదే పెరరేఁచీ నతఁడు

(॥కడ॥)
గక్కునఁ గాఁగిలించఁగా గయ్యాళించకువే
ఇక్కువ లంగఁగఁ గోప మిఁకనేటికే
అక్కరతో శ్రీ వేంకటాధిపతి కడపలో
వొక్కటాయ మెచ్చఁగదె వొద్దనున్నాఁడతఁడు

(||pallavi||)
kaḍabarāyam̐ḍu nīgu kappuramaṁdichchī vām̐ḍĕ
maḍisiyyave āgu manasichchī nadam̐ḍu

(||kaḍa||)
priyamulu sĕppam̐gānu pĕnam̐gaguve nīvu
nayāgārālu sūbam̐gā navvaguve
niyadāna mŏkkam̐gānu niṭliṁta yem̐ṭige
kriyagūḍa niyyagove kelusām̐sī nadam̐ḍu

(||kaḍa||)
seri mome sūḍam̐gānu sigguluvaḍaguve
kūrimi gŏsaram̐gānugobamem̐ṭige
gāraviṁchi piluvam̐gā kām̐tāḽiṁchaguve
perugŏni pāḍam̐gade pĕrarem̐sī nadam̐ḍu

(||kaḍa||)
gakkunam̐ gām̐giliṁcham̐gā gayyāḽiṁchaguve
ikkuva laṁgam̐gam̐ goba mim̐kaneḍige
akkarado śhrī veṁkaḍādhibadi kaḍabalo
vŏkkaḍāya mĕchcham̐gadĕ vŏddanunnām̐ḍadam̐ḍu