Kada gaadu drshta midi kalige maagu

కత గాదు దృష్ట మిది కలిగె మాకు
Language

(॥పల్లవి॥)
కత గాదు దృష్ట మిది కలిగె మాకు
సతమంటా నిట్టె పొద్దు జరపఁగవలసె

(॥కత॥)
కాయమనేటి మోహినీగజ మెక్కినారము
పాయవుమోహమదము పట్టెను మమ్ము
తీయరాని బందుపు తీగె తెంచివేయ లేము
యేయెడ విజ్ఞాన మిఁక యెఱిఁగేమా మేము

(॥కత॥)
విచ్చల సంసారమునేనిథి దొక్కినారము
పచ్చి మదనభూతము పట్టెను మమ్ము
గచ్చుల యహంకారగర్వము మానఁగ లేము
అచ్చపు మోక్షపుతెరు వబ్బీనా మాకు

(॥కత॥)
రామలరతి కొల్లాపురము చొచ్చినారము
యేమైనా యెగ్గు సిగ్గు లెంచము నేము
శ్రీమంతుఁడై నట్టి శ్రీ వేంకటేశుఁడే నన్ను
యేమరి యుండఁగ మమ్ము యేలినాఁడు వీఁడెవో

(||pallavi||)
kada gādu dṛṣhṭa midi kaligĕ māgu
sadamaṁṭā niṭṭĕ pŏddu jarabam̐gavalasĕ

(||kada||)
kāyamaneḍi mohinīgaja mĕkkināramu
pāyavumohamadamu paṭṭĕnu mammu
tīyarāni baṁdubu tīgĕ tĕṁchiveya lemu
yeyĕḍa vijñāna mim̐ka yĕṟim̐gemā memu

(||kada||)
vichchala saṁsāramunenithi dŏkkināramu
pachchi madanabhūdamu paṭṭĕnu mammu
gachchula yahaṁkāragarvamu mānam̐ga lemu
achchabu mokṣhabudĕru vabbīnā māgu

(||kada||)
rāmalaradi kŏllāburamu sŏchchināramu
yemainā yĕggu siggu lĕṁchamu nemu
śhrīmaṁtum̐ḍai naṭṭi śhrī veṁkaḍeśhum̐ḍe nannu
yemari yuṁḍam̐ga mammu yelinām̐ḍu vīm̐ḍĕvo