Kabadamu maana vaidi kalagaalamu

కపటము మాన వైతి కలకాలము
Language

(॥పల్లవి॥)
కపటము మాన వైతి కలకాలము
ఉపమ లింతేసి యాపె కున్నవా మొదలను

(॥కపటము॥)
యే మని చెప్పెంపితివో యింతితో యేకతమున
ఆమాఁట వింటానె ఆకె వచ్చెను
నీమతకమె కాఁబోలు నేఁడు నాతో జగడించీ
యీ మగుమాకు నిన్నాళ్లు యింత బలు వున్నదా

(॥కపటము॥)
సన్న యేమి సేసితివో సరి నాపెమోము చూచి
పన్ని నీ సంగడి వచ్చి పవ్వళించెను
కన్నెకు నీ యప్పణి కాఁబోలు నన్ను గద్దించీ
యెన్నఁడైనా యీపె నాతో యీసడించ వచ్చునా

(॥కపటము॥)
యెప్పుడు నేరిపితివో యీపెకు నీగుణములు
వొప్పుగ నా కిటు మొక్కి వొక్క టాయను
తప్పు దీరఁ గూడితివి దగ్గరి శ్రీవెంకటేశ
మెప్పించితి నీవు నన్ను మే లిం తెరుఁగునా

(||pallavi||)
kabaḍamu māna vaidi kalagālamu
ubama liṁtesi yābĕ kunnavā mŏdalanu

(||kabaḍamu||)
ye mani sĕppĕṁpidivo yiṁtido yegadamuna
āmām̐ṭa viṁṭānĕ āgĕ vachchĕnu
nīmadagamĕ kām̐bolu nem̐ḍu nādo jagaḍiṁchī
yī magumāgu ninnāḽlu yiṁta balu vunnadā

(||kabaḍamu||)
sanna yemi sesidivo sari nābĕmomu sūsi
panni nī saṁgaḍi vachchi pavvaḽiṁchĕnu
kannĕgu nī yappaṇi kām̐bolu nannu gaddiṁchī
yĕnnam̐ḍainā yībĕ nādo yīsaḍiṁcha vachchunā

(||kabaḍamu||)
yĕppuḍu neribidivo yībĕgu nīguṇamulu
vŏppuga nā kiḍu mŏkki vŏkka ṭāyanu
tappu dīram̐ gūḍidivi daggari śhrīvĕṁkaḍeśha
mĕppiṁchidi nīvu nannu me liṁ tĕrum̐gunā