Kabadamu limkanele kannu leduda nunnaamdu

కపటము లిఁకనేలే కన్ను లెదుట నున్నాఁడు
Language

(॥పల్లవి॥)
కపటము లిఁకనేలే కన్ను లెదుట నున్నాఁడు
నెపములు వేసి యెంత నీటు చూపేవే

(॥కప॥)
మంతనాలు గొంతవడి మాటలనుఁ గొంతవడి
యెంతవడి వట్టి జాగు లేమి సేసేవే
వంతుకు నాతఁడు వచ్చి వద్దఁ గాచుకున్నవాఁడు
కొంతపుఁ జూపులనేల కొచ్చి చూచేవే

(॥కప॥)
నవ్వులనే కొంతవడి నటనలఁ గొంతవడి
యెవ్వతె మాటలు వింటి విది యేఁటిదే
బువ్వాన నాతఁడు నిన్ను బోంసేతము రమ్మంటే
పువ్వులవాటులనేల పూఁచి వేసేవే

(॥కప॥)
సిగ్గులనే కొంతవడి సింగారాలఁ గొంతవడి
యెగ్గులుఁ దప్పులుఁ బట్ట నిందులో నేదే
అగ్గమై శ్రీ వేంకటేశుఁ డాతఁడే తా నిన్నుఁగూడె
వెగ్గళించి మఱీ నేల విఱ్ఱవీఁగేవే

(||pallavi||)
kabaḍamu lim̐kanele kannu lĕduḍa nunnām̐ḍu
nĕbamulu vesi yĕṁta nīḍu sūbeve

(||kaba||)
maṁtanālu gŏṁtavaḍi māḍalanum̐ gŏṁtavaḍi
yĕṁtavaḍi vaṭṭi jāgu lemi seseve
vaṁtugu nādam̐ḍu vachchi vaddam̐ gāsugunnavām̐ḍu
kŏṁtabum̐ jūbulanela kŏchchi sūseve

(||kaba||)
navvulane kŏṁtavaḍi naḍanalam̐ gŏṁtavaḍi
yĕvvadĕ māḍalu viṁṭi vidi yem̐ṭide
buvvāna nādam̐ḍu ninnu boṁsedamu rammaṁṭe
puvvulavāḍulanela pūm̐si veseve

(||kaba||)
siggulane kŏṁtavaḍi siṁgārālam̐ gŏṁtavaḍi
yĕggulum̐ dappulum̐ baṭṭa niṁdulo nede
aggamai śhrī veṁkaḍeśhum̐ ḍādam̐ḍe tā ninnum̐gūḍĕ
vĕggaḽiṁchi maṟī nela viṭravīm̐geve